రాబోయే 5G కాలం ఇండియాలో జియోదేనని ముఖేష్ అంబానీ ప్రకటించారు. జియో సొంతంగా 5G సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేసిందని.. వచ్చే ఏడాది నుంచే.. ప్రపంచ స్థాయి సేవలను భారత్‌లో అందిస్తామని స్పష్టం చేసింది. వార్షిక వాటాదారుల సమావేశంలో ముఖేష్ అంబానీ… ఎప్పట్లాకే కీలకమైన ప్రకటనలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా 5G సర్వీసుల ప్రారంభంలో ఎవరు చరిత్ర సృష్టిస్తారో అని ఎదురు చూస్తున్న సమయంలో.. అమెరికా, చైనా కంపెనీలు.. మేమంటే..మేము అని పోటీ పడుతున్నాయి. ఈ సమయంలో.. తాము 5Gని అభివృద్ధి చేసేశామని.. స్పెక్ట్రమ్ రాగానే.. పరీక్షిస్తామని ముఖేష్ ప్రకటించడం.. టెక్నాలజీ వర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తోంది.
ఏజీఎంలో ముఖేష్ అంబానీ.. సంచలనాత్మక విషయాలు వెల్లడించారు. రెండు రోజుల క్రితం.. ఇండియాకు వచ్చిన అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్.. ఇండియాలో.. రూ. 75వేల కోట్ల పెట్టుబడి పెడతామని ప్రకటించారు. అందులో రూ. దాదాపుగా 34వేల కోట్లను జియో ఫ్లాట్‌ఫామ్స్‌లోనే పెట్టబోతున్నట్లుగా ముఖేష్ ప్రకటించారు. జియో ఫ్లాట్‌ఫామ్స్‌లో 7.7 శాతం వాటాను గూగుల్‌కు రూ. 33,737 కోట్లకు అమ్ముతున్నట్లుగా ప్రకటించారు. ఇప్పటికే జియో ఫ్లాట్‌ఫామ్స్‌లో ఫేస్బుక్ కూడా పెట్టుబడి పెట్టింది. రూ.43,574 కోట్లతో 9.99శాతం వాటా కొనుగోలు చేసింది. అంటే.. రెండు టెక్ దిగ్గదాలు.. జియో ఫ్లాట్‌ఫామ్‌లో వాటా కలిగి ఉన్నట్లయింది. ప్రస్తుతం జియో ఈక్విటీ వాల్యూ 4.91లక్షల కోట్లు కాగా..ఎంటర్ ప్రైజ్ వాల్యూ 5.16 లక్షల కోట్లు.
గూగుల్‌తో కలిసి 5G అనేబుల్డ్ స్మార్ట్ ఫోన్‌ను తక్కువ ధరకే అందిస్తామని.. ముఖేష్ ప్రకటించారు. క్రితం సారి జరిగిన ఏజీఎంలో… రిలయన్స్ పెట్రో వ్యాపారంలో వాటాను.. సౌదీ ఆరామ్కో సంస్థకు అమ్మేసి.. రిలయన్స్‌ను రుణరహితంగా చేయనున్నట్లుగా ప్రకటించారు. ఆయితే.. ఆ డీల్‌కు ఇబ్బందులు ఏర్పడటంతో.. జియో ఫ్లాట్‌ఫామ్‌లో వాటాలు అమ్మేసి.. ఆ లక్ష్యం సాధించారు. అంతకు మించి ఇంకా గూగుల్ డీల్‌తో.. ఎక్కువ నిధులే సమీకరించారు. ఇప్పుడు ఆరామ్కోతో డీల్ ఉంటుందో లేదో.. ముఖేష్ క్లారిటీ ఇవ్వలేదు. అయితే.. 5G సర్వీసులు ప్రారంభించబోతున్నామని ప్రకటించి… సంచలనం మాత్రం సృష్టించారు.