ఈ రోజు డేట్ ఎంత.. జూలై 15. పవన్ కల్యాణ్ పుట్టిన రోజు ఎప్పుడు సెప్టెంబర్ రెండో తేదీ. ఈ రెండింటి మధ్య నెలన్నర గ్యాప్ ఉంది. కనీసం.. తర్వాతి రోజో.. తర్వాతి వారమో అయితే.. కనీసం అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే చెప్పుకోవచ్చు. కానీ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మాత్రం.. నెలన్నర రోజుల ముందు పవన్ కల్యాణ్ బర్తేడ్ ట్వీట్స్ ట్రెండ్ చేయడం ప్రారంభించారు. అడ్వాన్సుడ్ హ్యాపీ బర్త్ డే పవన్‌కల్యాణ్ అనే హ్యాష్ ట్యాగ్‌ను క్రియేట్ చేసి ట్విట్టర్లో ట్రెండ్ చేశారు. 24 గంటల్లోనే ఈ హ్యాష్ ట్యాగ్‌తో 27.3 మిలియన్స్ ట్వీట్స్ వచ్చాయి. ట్విట్స్లో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఏ రేంజ్ ఉత్సాహంలో ఉంటారో మరోసారి స్పష్టమయింది.
పవన్ కల్యాణ్ ఈ పుట్టిన రోజును.. మెమరబుల్‌గా ప్లాన్ చేయాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారని ఈ ట్రెండింగ్ ప్రాక్టీస్ ద్వారానే అంచనా వేయవచ్చు. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత పవన్ కల్యాణ్ సినిమాలు మానేశారు. ఇప్పుడు కొత్తగా ఆయన మళ్లీ మేకప్ వేసుకున్నారు. అంతా బాగుంటే.. ఈ పాటికి వకీల్ సాబ్ రిలీజైఉండేది. కానీ కరోనా దెబ్బకొట్టింది. దాంతో.. ఆయన సినిమాలన్నీ.. అలా ప్లానింగ్‌లోనే ఉండిపోయాయి. పవన్ కల్యాణ్ కూడా బయటకు రావడంలేదు. పూర్తిగా కుటుంబానికే సమయం కేటాయిస్తున్నారు. ఫ్యాన్స్ మాత్రం.. ఆయనను ఖుషీ చేయడానికి.. ప్రాక్టీస్ ప్రారంభించారు.
జనసేన సోషల్ మీడియా విభాగం.. చాలా చురుగ్గా ఉంటుంది. ట్విట్టర్లో పవన్ కల్యాణ్ న్యూస్ ఏదైనా వస్తే బాగా ట్రెండింగ్ చేస్తారు. పుట్టిన రోజు లాంటి వాటికి.. స్పెషల్ హ్యాష్ ట్యాగ్స్ పెట్టి.. బీభత్సంగా… ట్రెండింగ్ సృష్టిస్తారు. పెద్దగా ఈవెంట్ లేకుండానే.. కేవలం అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్ డేకే.. 27 మిలియన్స్ ట్వీట్స్ చూపించారంటూ.. నిజంగా.. సెప్టెంబర్ 2కి ట్విట్టర్ బద్దలు కొట్టేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు.