తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రుల్లో తర్వాతి అరెస్ట్ గంటా శ్రీనివాసరావుదేనని.. మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పేశారు. విజయసాయిరెడ్డి నేతృత్వంలో జరిగిన ఓ సభలో..నేరుగా ప్రజల ముందు.. మీడియా ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే టీడీపీకి చెందిన మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు అరెస్టయ్యారని.. తర్వాత గంటా శ్రీనివాసరావే అరెస్టవుతారన్నారు. రెండు రోజుల క్రితం.. విజయసాయిరెడ్డి.. సైకిళ్ల కుంభకోణం జరిగిందంటూ.. ట్వీట్ చేశారు. దాంతో.. వైసీపీ సోషల్ మీడియా విభాగం.. అప్పటి నుండి.. గంటా శ్రీనివాసరావును ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారనే ప్రచారాన్ని ప్రారంభించారు.
సైకిళ్ల కొనుగోళ్ల విషయంలో… ఏం జరిగిందో.. కేసు నమోదయిందో.. విచారణ జరిగిందో లేదో ఎవరికీ తెలియదు. కానీ.. గంటాను అరెస్ట్ చేస్తామంటూ… వైసీపీ నేతలు.. మంత్రులు ప్రచారం ప్రారంభించారు. ఇప్పటికే.. టీడీపీ నేతలను టార్గెట్ ను చేశారని.. వరుసగా అరెస్టులు చేస్తూ పోతారని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో… మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఒకప్పుడు.. గంటా శ్రీనివాస్ తో పాటే… అవంతి రాజకీయం చేశారు. ఇద్దరూ పీఆర్పీ తరపున ఎన్నికయ్యారు. తర్వాత ఇద్దరూ టీడీపీలోకి వచ్చారు. తనకు మంత్రి కావాలన్న కోరిక ఉండటంతో.. ఎమ్మెల్యే టిక్కెట్ కోసం.. వైసీపీలో చేరి.. అనుకున్నట్లుగానే మంత్రి అయ్యారు. గంటా ఎమ్మెల్యేగా గెలిచినా… పార్టీ ఓడిపోవడంతో.. సైలెంటయ్యాయి.
రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టడానికి.. వారిపై ఆరోపణలు చేసి… ప్రాథమిక విచారణ కూడా లేకుండా.. అరెస్ట్ చేసే వ్యూహంలో.. వైసీపీ ఉందని.. టీడీపీ నేతలు కొంత కాలంగా ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం టీడీపీ నేతల్ని ఎలా టార్గెట్ చేసిందో వివరిస్తూ… ఆధారాలతో సహా… రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేసినట్లుగా ఎంపీలు ప్రకటించారు. ఓ వైపు… టీడీపీ నేతలు… కక్ష సాధింపులపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఆరోపిస్తున్న సమయంలో.. రాజకీయంగా… అవంతి లాంటి వాళ్లు.. గంటాను అరెస్ట్ చేస్తామని.. సొంతంగా ప్రకటించడం.. రాజకీయంగానూ కలకలం రేపుతోంది.