ఆంధ్రప్రదేశ్‌లో చిత్ర విచిత్రాలు వెలుగు చూస్తున్నాయి. ఎమ్మెల్యే స్టిక్కర్లతో రూ. కోట్లకు కోట్లు తీసుకెళ్తున్న వాహనాలు పట్టుబడుతూ ఉంటాయి. వాహనాలు మావే కానీ.. స్టిక్కర్లు మాత్రం డ్రైవర్లు పెట్టారని.. వైసీపీ నేతలు చెప్పేస్తూ ఉంటారు. అలాగే.. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా కూడా అలాంటి వ్యవహారంలోనే దొరికిపోయారు. ఆయనకు చెందిన ఓ గోడౌన్లో నిషేధిత గుట్కా తయారీ పరిశ్రమ నడుస్తోంది. చాలా కాలంగా… ఈ వ్యాపారం నడుస్తోంది. సుధాకర్ రెడ్డి అనే ముస్తఫా ప్రధాన అనుచరునికి లీజుకు ఇచ్చినట్లుగా చూపించి.. ఫ్యాక్టరీ నడిపేస్తున్నారు. ఎంత కాలం నుంచి ఇలా దంతా చేస్తున్నారో తెలియదు కానీ.. పోలీసులకు నిన్నే తెలిసినట్లుగా దాడులు చేశారు.
అక్కడ ఉన్న సెటప్ చూసి ఆశ్చర్యపోయారు. రూ. కోటి విలువ చేసే యంత్రాలే ఉన్నాయి. ఇంకా పెద్ద ఎత్తున గుట్కా తయారీ సామాగ్రి లభించింది. ఆ గోడౌన్లో తయారు చేసి.. ఏపీకి మాత్రమే కాదు.. ఇతర రాష్ట్రాలకు కూడా తరలించి విక్రయాలు చేస్తున్నట్లుగా గుర్తించారు. గుట్కాల తయారీని వినియోగాన్ని ఇప్పటికే నిషేధించారు. నిషేధం తర్వాత.. రూ. రెండు రూపాయలు ఉండే గుట్కాని రూ. పది రూపాయలకు అమ్ముతూ.. సొమ్ము చేసుకుంటున్నారు. రూ. కోట్లకు కోట్లు ఆదాయం వచ్చే పరిస్థితి ఉండటంతో.. రాజకీయ నేతలు రంగంలోకి దిగిపోయారు.
ముస్తఫాకు గోడౌన్లు ఉండటంతో.. వాటిలో .. ఇలాంటి తయారీ ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ఏ రాజకీయ నాయకుడు కూడా.. అన్నీ తన అనుచరుల పేర్ల మీదనే చేస్తారు. తన పేరు మీద ఏమీ చేయరు. అనధికారికంగా మాత్రం.. అది ఆయనదే అని.. అందరికీ తెలిసిపోతూ ఉంటుంది. చెన్నైలో పట్టుబడ్డ నగదువిషయంలో అయినా… గుంటూరు ఎమ్మెల్యే ముస్తాఫా..గోడౌన్ గుట్కా ఫ్యాక్టరీ విషయంలోనూ అయినా అంతే. అధికార పార్టీ కాబట్టి.. అనుచరుల మీద నెట్టేసి.. వారంతా సేఫ్‌గానే ఉంటారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.