దేశ ఐటీ రంగంలో తనదైన ప్రత్యేకత చాటుకుంటున్న హైదరాబాద్ కు ధీటుగా.., తెలంగాణలోని ఇతర నగరాల్ని కూడా.. మార్చాలని కేటీఆర్ సంకల్పించారు. ముందుగా.. ఐటీ ఇన్ఫ్రాక్చర్ను కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం.. వరంగల్‌లో ఐటీ టవర్‌ను ప్రారంభించిన కేటీఆర్.. తాజాగా కరీంనగర్లోనూ అలాంటి ఏర్పాటు చేశారు. వరంగల్ ఐటీ టవర్‌లో..కొన్ని ప్రముఖ కంపెనీలు కూడా.. తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. మంచి ప్రారంభం అనుకున్న కేటీఆర్… కరీనంగర్లోనూ అలాంటి నిర్మాణమే చేపట్టారు. రూ. 34 కోట్లతో ఐటీ టవర్‌ను వేగంగా నిర్మించారు. ఔత్సాహిక సాఫ్ట్ వేర్ నిపుణులకు… స్వదేశంలో.. ఐటీ కంపెనీలు పెట్టాలనుకునే ఎన్నారైలకు ప్రోత్సాహం ఇచ్చేలా ఈ ఐటీ టవర్‌ను నిర్మించారు.
స్కిల్ ఏ ఒక్కరి సొత్తు కాదని. పట్టణాలు, గ్రామీణ యువత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సత్తా చాటుతోందన్న అభిప్రాయంతో ఉన్న కేటీఆర్.. ద్వితీయ శ్రేణి నగరాల్లో మరింతగా ఐటీని విస్తరించాలని నిర్ణయించుకున్నారు. కరీంనగర్లో.. స్టార్టప్ లను ప్రోత్సహించేందుకు టాస్క్.. టీ హబ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని నర్ణయించుకున్నారు. హైదరాబాద్ కంపెనీలు.. తమ కార్యక్షేత్రాలను.. ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరించేలా.. వారిని ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా కొన్ని చర్యలను కేటీఆర్ తీసుకుంటున్నారు.
జిల్లా కేంద్రాల్లో.. ఐటీ సెంటర్లు పెట్టేందుకు ప్రత్యేకమైన రాయితీలు ఇస్తున్నారు. విస్తరించాలనుకుంటున్న కంపెనీలతో.. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ లాంటి చోట్ల ఉండే మౌలిక సదుపాయాల గురించి వివరిస్తున్నారు. నాలుగైదేళ్లలో అయినా… ఐటీని.. జిల్లాలకు విస్తరించాలన్న లక్ష్యాన్ని కేటీఆర్ పెట్టుకున్నారు. ఈ దిశగా.. విజయవంతంగా అడుగులు వేస్తున్నారు. స్టార్టప్‌లను ప్రోత్సహిస్తే.. గొప్ప ఆవిష్కరణలు వస్తాయని కేటీఆర్ నమ్ముతున్నారు.