నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా తిరిగి నియమించాలని గవర్నర్ విశ్వభూషణ్ .. ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఈ మేరకు రాజ్‌భవన్ నుంచి లేఖ ప్రభుత్వానికి అందింది. గతంలో నిమ్మగడ్డ పదవీ కాలాన్ని తగ్గిస్తూ.. జారీ చేసిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టి వేసింది. నిమ్మగడ్డను మళ్లీ నియమించాలని ఆదేశించింది. అయితే.. ప్రభుత్వం హైకోర్టు తీర్పును అమలు చేయలేదు. స్టే కోసం సుప్రీంకోర్టుకు వెళ్లినా లభించలేదు. అయినప్పటికీ.. నిమ్మగడ్డను నియమించకపోవడంతో.. ఆయన కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. గవర్నర్‌ను కలవాలని నిమ్మగడ్డను ఆదేశించింది. ఆ మేరకు నిమ్మగడ్డ కలిసి.. హైకోర్టు ఆదేశాలను వివరించారు.
మొత్తం వ్యవహారాలన్ని పరిగణనలోకి తీసుకున్న గవర్నర్.. రాజ్యాంగాధిపతిగా.. హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. వాస్తవంగా.. ఎస్ఈసీ రాజ్యాంగబద్ధమైన పదవి. ఆ పదవి నియామకం గవర్నర్ ఉత్తర్వుల ద్వారానే జరుగుతుంది. అయితే.. సహజంగా.. ఆ పదవిలో ఎవరు ఉండాలనేది.. ప్రభుత్వం నిర్ణయించి సిఫార్సు చేస్తుంది. ఒక్కోసారి గవర్నర్ తన చాయిస్ కూడా చెప్పవచ్చు. అంతిమంగా గవర్నర్ మాత్రమే ఉత్తర్వులివ్వగలరు. అయితే ప్రభుత్వం నుంచి ఆ ప్రతిపాదన రావాల్సి ఉటుంది. ప్రభుత్వం నుంచి అలాంటి ప్రతిపాదన ఏదీ గవర్నర్‌కు రాలేదు.
ప్రస్తుతం గవర్నర్ కూడా.. హైకోర్టు ఆదేశాల మేరకు.. తన పనిని తాను పూర్తి చేసినట్లు అవుతుంది. న్యాయవ్యవస్థను గౌరవించి.. నిమ్మగడ్డను ఎస్ఈసీగా నియమించాలని సిఫార్సు చేసినట్లు అవుతుంది. అయితే.. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటున్నదన్నది ఇప్పుడు ఆసక్తికరం. కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ నిలిపివేయాలంటూ.. ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ ఇరవై నాలుగో తేదీన జరగనుంది. అప్పటి వరకూ.. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకునే అవకాశం లేదన్న భావన ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది.