నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను మళ్లీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా నియమించాలంటూ.. గవర్నర్ ప్రభుత్వానికి స్పష్టమైన సూచనలు ఇచ్చారు. అయితే.. ప్రభుత్వం మాత్రం.. ఈ విషయంలో హైకోర్టు ఆదేశాలనే పట్టించుకోలేదు.. ఇక గవర్నర్ ఆదేశాలు ఎంత అన్నట్లుగా వ్యవహరించాలని డిసైడయినట్లుగా కనిపిస్తోంది. వైసీపీ తరపున అధికారికంగా ప్రెస్‌మీట్ పెట్టిన చీఫ్ విప్.. శ్రీకాంత్ రెడ్డి… నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై.. పాత ఆరోపణలనే కొత్తగా చేశారు కానీ… గవర్నర్ ఆదేశాలను తాము శివసావహిస్తామని ఎక్కడా చెప్పలేదు. పైగా.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ న్యాయపోరాటం చేయడం తప్పన్నట్లుగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. కోర్టుల్లో పోరాడటానికి ఆయనకు కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. స్టార్ హోటళ్లలో ఇతర పార్టీల నేతల్ని కలుస్తూ.. రాజ్యాంగ వ్యవస్థకు తగ్గట్లుగా వ్యవహరించడం లేదన్నారు. అంటే నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై ఆరోపణలు చేయడానికి ఎస్ఈసీగా అభివర్ణిస్తున్న వైసీపీ.. మామూలుగా అయితే.. ఆయన పదవిలో లేరని .. ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోంది.
గవర్నర్ ఆదేశాలు ఓ రకంగా.. ప్రభుత్వాన్ని సంకట స్థితిలోకి నెట్టేశాయి. హైకోర్టు చెప్పినా వినలేదు.. ఇప్పుడు గవర్నర్ ఆదేశించినా వినకపోతే.. రాజ్యాంగ సంక్షోభం వస్తుందని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే.. ప్రభుత్వ పెద్దలు మాత్రం.. ఈ విషయంలో… ఏం జరిగినా సరే.. నిమ్మగడ్డ విషయంలో.. మెత్తబడకూడదన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే కోసం.. సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ వేసిన పిటిషన్ ఇరవై నాలుగో తేదీన ..విచారణకు రానుంది. అప్పుడు స్టే లభిస్తే…మరికొంత ఆలస్యం చేయడానికి అవకాశం ఉంటుందని.. అప్పటి వరకూ ఎదురు చూడాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
నిజానికి 24వ తేదీన కోర్టు స్టే ఇచ్చినా.. అది నిమ్మగడ్డ వేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌పై విచారణకు మాత్రమే. నిమ్మగడ్డ విషయంలో ఇచ్చిన ఆదేశాలకు కాదు. ఇప్పటికే మూడు సార్లు.. నిమ్మగడ్డను పునర్నియమించాలని ఇచ్చిన ఆదేశాలపై… సుప్రీంకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. అయినప్పటికీ.. ప్రభుత్వం ఏ మాత్రం.. లెక్కలోకి తీసుకోవడం లేదు. న్యాయవ్యవస్థలో ఉన్న లోపాలను పకడ్బందీగా వాడుకుంటూ మార్చి మార్చి పిటిషన్లు వేసి.. టైం పాస్ చేస్తున్నారు. దీంతో.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం కరిగిపోతోంది.
ప్రభుత్వ వ్యూహం ప్రకారం… వీలైనంత కాలం… ఇలాగే.. పిటిషన్లు వేస్తూ.. టైం పాస్ చేస్తే.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం ముగిసిపోతుందని.. ఆ తర్వాత కావాల్సిన వారిని గవర్నర్‌కు సిఫార్సు చేసి నియమించుకోవచ్చన్న వ్యూహాన్ని వైసీపీ అగ్రనేతలు అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అయితే.. న్యాయపరంగా.. ఇప్పటికే.. ప్రభుత్వం ముందు ఉన్న అన్ని అవకాశాలు అయిపోయాయని.. నిమ్మగడ్డను పునర్నియమించడమే మిగిలిందని నిపుణులు అంటున్నారు. లేకపోతే.. రాజ్యాంగ సంక్షోభమేనని చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం మొండి పట్టుదలకుపోతే కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.