వర్మ దారిలోనే వెళ్తున్నాడు నూతన్ నాయుడు.వర్మ ట్రిక్కులనే ఫాలో అవుతున్నాడు. వర్మపై `పరాన్న జీవి` అనే సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు దర్శకుడు. ఈ టీజర్‌ని ఈరోజు ఏడింటికి రిలీజ్ చేస్తామని ప్రకటించింది చిత్రబృందం. అంతోనే కౌంటర్ వేసేసింది. దురదృష్టవశాత్తూ ఓ గంట ముందే టీజర్ లీక్ అవుతున్నందుకు సంతోషంగా ఉందని, టీమ్ సభ్యుల్లో ఒకరి కుట్ర వల్ల టీజర్ గంట ముందే బయటకు వస్తుందని సెటైర్ వేసింది. ఈ సెటైర్ ఎవరిపైనో ఈజీగా అర్థమైపోయి ఉంటుంది. వవర్ స్టార్ ట్రైలర్ చూడాలంటే పాతిక రూపాయల టికెట్టు పెట్టాడు వర్మ. తీరా చూస్తే.. ట్రైలర్ ముందే లీకైపోయింది. అది వర్మనే కావాలని చేశాడని, అదో పబ్లిసిటీ ట్రిక్కని జనం నమ్మకం. దాన్నే ఇప్పుడు నూతన్ నాయుడు కూడా ప్లే చేస్తున్నాడు. మా టీజర్ లీకవుతోంది… అని ముందే చెప్పడం – నిజంగా కొత్త స్ట్రాటజీనే. ఈరోజు టీజర్ వస్తుంటే, రేపు ట్రైలర్‌ని విడుదల చేస్తున్నారు. ఈలోగా రెండు పాటల్నీ బయటకు వదులుతార్ట. మొత్తానికి `పరాన్నజీవి` ప్రమోషన్లు ఫుల్ స్వింగ్ లో ఉన్నట్టే.