లవర్ బోయ్ కథలకు సరిగ్గా సరిపోతాడు నాగశౌర్య. అయితే ప్రతీ హీరోకీ మాస్ ఇమేజ్ పై గురి ఉంటుంది కదా? శౌర్య కూడా అప్పుడప్పుడూ అలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. తాజాగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేస్తున్నాడు శౌర్య. ఈ సినిమా కోసం తన బాడీని పూర్తిగా మార్చుకున్నాడు. వర్కవుట్లు చేసి, జిమ్ లో గంటల కొద్దీ కష్టపడి కండలు పెంచాడు. ఓ ప్రొఫెషనల్ అథ్లైట్ లా మారాడు. ఇప్పుడు శౌర్యని చూస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలా మారిపోయాడు. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ లుక్ బయట పెట్టారు. ఫస్ట్ లుక్ సోమవారం ఉదయం 9 గంటలకు శేఖర్ కమ్ముల చేతుల మీదుగా విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. కృతిక శర్మ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.