ఆంధ్రప్రదేశ్లో మద్యం దుకాణాలు రాత్రి తొమ్మిది గంటల వరకూ తెరిచి ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఈ ఆదేశాల్లో చిత్రాలు.. విచిత్రాలు ఉన్నాయి. తొమ్మిది గంటల వరకూ ఎందుకు తెరిచి ఉంచాలంటే.. రోజువారీ అమ్మాకల లెక్కలు.. చూసుకోవడానికి తెరిచి ఉంచాలంట. మరి ఆ సమయంలో.. అమ్మకాలు చేయరా అంటే.. అదేం లేదు.. తొమ్మిది గంటల వరకూ తెరిచి ఉంచుతారంటే..దానర్థం అప్పటి వరకూ అమ్ముతారనే అర్థం. మామూలుగా అయితే దుకాణం మూసేసిన తర్వాత.. దుకాణాల్లో ఉండే ఉద్యోగులు.. ఆ రోజు అమ్మకాల లెక్కలు.. స్టాక్ వివరాలు పై అధికారులకు చెబుతారు. అదంతా రొటీన్ ప్రాసెస్ . ఇప్పుడు దాని కోసమే.. సమయాన్ని పెంచుతున్నట్లుగా.. జీవో ఇవ్వడమే పాలకుల అతి తెలివికి నిదర్శనం.
ఇప్పటికే మద్యనిషేధం కోసమే ధరలు పెంచామంటూ.. ప్రభుత్వం చెబుతున్న వాదనపై అనేక రకాల సెటైర్లు పడుతూ ఉండగా.. ఇప్పుడు అమ్మకాల సమయం పెంచి.. దానికి కూడా.. విచిత్రమైన కారణాన్ని చెప్పడం.. ప్రజల్ని మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రజల్ని మరీ అంత అమాయకులుగా జమ కడుతున్నారు.. ఓ మాదిరి తెలివి గలవాళ్లుగా కూడా.. ప్రభుత్వం పరిగణించడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించడంతో… ఉన్న దుకాణాల వద్దకే మందుబాబులు బారులు తీరుతున్నారు. దీంతో.. సమయం ముగిసిపోయిన తర్వాత కూడా.. పెద్ద ఎత్తువ మందు బాబులు దుకాణాల వద్దకు వస్తున్నారు.
సాధారణంగా రోజు కూలీలు .. రోజంతా పని చేసుకున్న తర్వాత సాయంత్ర ఆరేడు గంటల తర్వాత తమ కూలీ డబ్బులు తీసుకుని బయటకు వస్తారు. వారు నేరుగా.. మద్యం దుకాణాల వద్దకే వస్తారు. ఆ తర్వాత డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. త్వరగా మూసివేయడం వల్ల.. అమ్మకాలు పెద్దగా లేవన్న ఫీడ్ బ్యాక్.. ప్రభుత్వానికి అందడంతో.. లెక్కలు చూసుకునే నెపంతో.. తొమ్మిది గంటల వరకూ దుకాణాల్ని… తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. లెక్కలు చూసుకోవడానికి దుకాణం తెరిచి ఉంచాల్సిన పని లేదు.. ఓ వైపు అమ్మకాలు సాగుతూంటే లెక్కలు చూసుకోరు. మొత్తం దుకాణం మూసేసిన తర్వాతే లెక్కలు చూసుకుంటారు. ఈ మాత్రం అవగాహన కూడా ప్రజలకు ఉండదని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ఉంది.