మెగా తనయ సుస్మిత కొణిదెల వెబ్ సిరీస్ తో నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ఓయ్ దర్శకుడు ఆనంద్రంగా తో ఓ వెబ్ సిరీస్ నిర్మిస్తోంది. ఇదో క్రైమ్ థ్రిల్లర్. షూటింగ్ కూడా ఇటీవలే మొదలైంది. ఇప్పుడు మరో రెండు వెబ్ సిరీస్లను ప్లాన్ చేస్తోంది. అయితే ఇవి రెండూ రొమాంటిక్ కామెడీలని తెలుస్తోంది. ఓ వెబ్ సిరీస్ లో నిహారిక నటించే అవకాశం ఉందని టాక్. ఈ మూడు వెబ్ సిరీస్ లూ జీ 5 కోసమే అని తెలుస్తోంది. జీ 5 తో చేసుకున్న ముందస్తు ఒప్పందం ప్రకారమే.. వాళ్ల కోసం మూడు వెబ్ సిరీస్లను ప్లాన్ చేశారు. అందులో భాగంగా ఒకటి పట్టాలెక్కించారు. మిగిలినవి రెండూ ఇప్పుడు చర్చల దశలో ఉన్నాయి. మెగా ఓటీటీ వేదిక `ఆహా` ఉన్నప్పటికీ.. జీ 5 కోసం సుస్మిత వెబ్ సిరీస్లను నిర్మించడం ఆశ్చర్యకరమే. బహుశా.. ముందు రచ్చ గెలిచి, ఆ తరవాత ఇంట్లో సత్తా చూపించాలని డిసైడ్ అయ్యారేమో..?