గాయని సునీతకు ఆగ్రహం వచ్చింది. పళ్లురాలిపోతాయ్. అంటూ హెచ్చరించింది. దానికీ ఓ కారణం ఉంది. అనంతపురంకి చెందిన చైతన్య అనే ఓ గాయకుడు.. సునీత పేరు చెప్పి జనాల్ని మోసం చేస్తూ, డబ్బులు దండుకుంటున్నాడట. ఈ విషయం స్థానిక పత్రికలో ప్రచురితం అయ్యింది. ఇది తెలిసి… సునీత సీరియస్ అయ్యింది. ”చైతన్య ఎవరో నాకు తెలీదు. వాడు కనిపిస్తే పళ్లు రాలిపోతాయ్. నా పేరు చెప్పి, మా ఇంట్లోవాళ్ల పేరు చెప్పి చాలామందిని మోసం చేసి డబ్బులు వసూలు చేశాడని విన్నాను. అసలు ఇలాంటి వాళ్లని జనాలు ఎలా నమ్ముతున్నారో అర్థం కావడం లేదు. నాపై చాలా రూమర్లు వచ్చాయి. కానీ నేనెప్పుడూ వాటికి స్పందించలేదు. ఇప్పుడు స్పందించడం నా బాద్యత అనిపించింది. నా పేరు వాడుకుని, ఎవరో డబ్బులు వసూలు చేయడం బాధనిపించి ఇలా స్పందిస్తున్నాను. ఇలాంటి వాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండండి” అంటూ హెచ్చరించింది. సునీత ఈ విషయాన్ని పోలీసుల వరకూ తీసుకెళ్లాలని భావిస్తోందట. సదరు చైతన్య అనే వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సునీత సన్నాహాలు చేసుకుంటోంది.