వర్మపై చాలామందికి పట్టరానంత కోపం ఉంది. దాన్ని ఎలా ప్రదర్శించాలో ఎవ్వరికీ తెలీలేదు. వాళ్లకు వర్మనే ఓ మార్గం చూపించాడు. 20 – 30 నిమిషాల నిడివితో సినిమా తీసి, జనంలోకి వదలమని పరోక్షంగా సలహా ఇచ్చాడు. ఇప్పుడు అంతా అదే పాటిస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ కొంతమంది ఆర్జీవిపై `పరాన్నజీవి` అనే సెటైరికల్ సినిమా తీశారు. దాని ఫలితం సంగతి పక్కన పెడితే, విడుదలకు ముందు `పరాన్న జీవి` వార్తల్లో నిలవగలిగింది. జొన్నవిత్తుల అప్పుడెప్పుడో `ఆర్జీవి` అనే సినిమా మొదలెట్టాడు. ఈమధ్యే ఓ పాట కూడా విడుదల చేశారు. `డే రా బాబా` అంటూ ఓ వెబ్ సిరీస్ ఆర్జీవీపైనే తయారవుతోంది. ఇప్పుడు మరో సినిమా పట్టాలెక్కుతోంది. పేరు.. `ఎవడ్రా`. ఆర్జీవిపై కొంతమంది దాడి చేసి, చితగ్గొట్టేస్తే, ఆర్జీవీ ఆసుపత్రిలో చేరితే ఎలా ఉంటుందన్నది ఈ సినిమా కాన్సెప్ట్. ఈరోజు కాన్సెప్ట్ పోస్టర్నీ విడుదల చేశారు. ఆసుపత్రి బెట్ మీద ఓ పేషెంట్.. వెనుక గోడ మీద శ్రీదేవి, హిచ్ కాక్ పోస్టర్లు.. పక్కన వాడ్కా బాటిల్. అదీ.. కాన్సెప్టు. స్టోరీ అర్థమైందనుకుంటా.