ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నప్పటికీ.. రిపోర్టుల్లో తగ్గించి చూపడం లేదని… ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కోవిడ్ నియంత్రణ చర్యలపై అధికారులతో జరిగిన సమీక్షలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎక్కువ నమోదయితే మాత్రం.. ఎందుకు తగ్గించి చూపుతారనే సందేహం సహజంగానే ముఖ్యమంత్రి మాటలు విన్న వారికి వస్తుంది. బహుశా.. ఇతర రాష్ట్రాల్లో కేసులు తగ్గించి చూపిస్తున్నారని వస్తున్న ఆరోపణలతో జగన్ ఇలా స్పందించి ఉంటారని భావిస్తున్నారు.
అధికారుల సమీక్షలోనే.. .. ఇప్పటి వరకూ ఆరు వేలకుపై కేసులు నమోదయ్యాయని.. అధికారులు చెప్పారనన్నారు. అయితే కాసేపటికి విడుదల చేసిన బులెటిన్లో ఇరవై నాలుగు గంటల్లో 7948 కేసులు నమోదయినట్లుగా అధికారులు బులెటిన్ విడుదల చేశారు. 58 మంది చనిపోయారు. రోజుకు… యాభై వేల టెస్టులు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని జగన్..ప్రకటించారు. ప్రతి మిలియన్ జనాభాకు 31వేలకు పైగా పరీక్షలు చేస్తున్నామని90 శాతం పరీక్షలు కొవిడ్ క్లస్టర్లలోనే చేస్తున్నామన్నారు. అధికారులు అందరూ.. కరోనాపై పోరాటంలో బాగా పని చేస్తున్నారని ప్రశఅనించారు. వీటితోపాటు.. జగన్ సమీక్షలో ఎప్పుడూ చేసే వ్యాఖ్యలే చేశారు. కొవిడ్ వస్తుంది.. పోతుంది, దానితో కలిసి జీవించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఏపీలో కరనా మరణాల లేటు ఒక శాతం మాత్రమేనని దేశంలో మూడు శాతం ఉందని గుర్తు చేశారు.
కరోనా సోకకుండా… తీసుకోవాల్సిన జాగ్రత్తలపై… భారీగా ప్రచారం చేయాలని జగన్ ఆధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో పోస్టర్లు పెట్టాలన్నారు. హోంక్వారంటైన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని.. డాక్టర్లు వారి ఇళ్లకు వెళ్లి ఆరోగ్యాన్ని పరీక్షించాలన్నారు. ప్రస్తుతం ఏపీలో 80వేల ఐసోలేషన్ పడకలు ఉన్నాయని.. వాటిని ఉపయోగించుకోవాలన్నారు.