ఈఎస్ఐ స్కాం కేసులో అరెస్టయిన అచ్చెన్నాయుడుకు హైకోర్టు బెయిల్ నిరాకరించింది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను కొట్టి వేస్తూ తీర్పు చెప్పింది. కేసు విచారణ కీలక దశలో ఉందని… ప్రధానమైన నిందితుల్ని ఒకరిని అరెస్టు చేయాల్సి ఉందని.. ఏసీబీ తరపు న్యాయవాది వాదించారు. ఆయన వాదనతో హైకోర్టు ఏకీభవించింది. ఇప్పటికే.. కింది కోర్టు.. అచ్చెన్న బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. ప్రస్తుతం అచ్చెన్నాయుడు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆపరేషన్ చేయించుకున్నప్పటికీ.. అరెస్ట్ చేశారు. దాంతో ఆపరేషన్ గాయం తిరగబెట్టింది. అయితే ప్రభుత్వం మాత్రం.. జైలుకే పంపింది. ఆయన న్యాయపోరాటం చేసి.. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందే అవకాశాన్ని పొందారు.
అచ్చెన్నాయుడుకు బెయిల్ రాకుండా… కొంత మందిని కావాలనే అరెస్టు చేయడం లేదని.. విచారణ చేయడం లేదని.. ఉద్దేశపూర్వకంగానే… అచ్చెన్నను జైల్లో ఉంచే ఉద్దేశంతోనే… ఇలా చేస్తున్నారని.. ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో వాదించారు. అయితే.. ఇంకా సాక్ష్యాలు సేకరించాల్సి ఉందని.. ఈ సమయంలో బెయిల్ ఇవ్వడం సరి కాదని.. బెయిల్ పిటిషన్‌పై విచారణ సమయంలో… ఏసీబీ తరపు న్యాయవాదులు వాదించారు. అచ్చెన్నాయుడును గత నెల పన్నెండో తేదీన నిమ్మాడలో అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆయన … కొన్ని రోజులు జైల్లో.. ఎక్కువ రోజులు ఆస్పత్రిలో ఉంటున్నారు.
అచ్చెన్నకు బెయిల్ రాకపోవడంతో.. మరికొన్ని రోజులు ఆయన.. ఆస్పత్రిలోనే ఉండనున్నారు. ఆయనకు పూర్తి నయం అయిన తర్వాత జైలుకు తరలించే అవకాశం ఉంది. డివిజన్ బెంచ్‌కు లేదా.. సుప్రీంకోర్టులో బెయిల్ కోసం.. పిటిషన్ వేసే అవకాశం ఉంది. అచ్చెన్న అవినీతికి పాల్పడినట్లుగా ఆధారాలు లేవని… రాజకీయ వేధింపుల కేసు అని.. టీడీపీ నేతలు.. మొదటి నుంచి ఆరోపిస్తున్నారు.