ఆమెది మానసిక వైపరీత్యమో.. జీవితం అంటే తెలియని తనమో కానీ.. తొమ్మిది పెళ్లిళ్లు చేసుకుంది. చేసుకున్న ప్రతీ సారి… ఆ భర్తతో ఒకటి రెండు నెలలు బాగా ఉంటుంది. తర్వాత ఎవరు పరిచయం అయితే.. వారితో రిలేషన్ పెట్టుకుంటుంది. పెళ్లి కాలేదనో.. అయినా.. విడిపోయామనో చెప్పి… అతన్ని పెళ్లి చేసుకుని.. మకాం మార్చేస్తుంది. ఇలా.. మొత్తం తొమ్మిది మందిని పెళ్లి చేసుకుంది. పదో వ్యక్తితో సన్నిహితంగా ఉంటోంది. కానీ.. మిగతా ఎనిమిది మందిలా… ఈ తొమ్మిదో భర్త లేడు. ఇతరులతో సన్నిహితంగా ఉంటోందని.. చంపేశాడు. ఈ కథలో అసలు చిత్రం.. ఆమె తొమ్మిది పెళ్లిళ్లు చేసుకుందని.. చంపిన భర్తకు తెలియదు. పోలీసులు దర్యాప్తు చేస్తేనే తెలిసింది.
హైదరాబాద్‌లో పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 30 ఏళ్ల వరలక్ష్మి అనే మహిళ దారుణ హత్యకు గురయింది. ఆమెను భర్త నాగరాజు చంపేశాడు. స్వయంగా నాగరాజు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి విషయం చెప్పి లొంగిపోయారు. పోలీసులు ఆమె మృతదేహాన్ని గుర్తించి కేసును పరిశోధించారు. వరలక్ష్మి ఎవరు అని ఆరా తీసేసరికి అన్ని వివరాలు బయటకు వచ్చాయి. వరలక్ష్మి ఓ పెట్రోల్ బంక్‌లో పని చేస్తోంది. ఆమెకు ఓ కుమారుడు ఉన్నారు. పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ కొట్టించుకునే క్యాబ్ డ్రైవర్ నాగరాజుతో ఆమెకు పరిచయం అయింది. అది పెళ్లి చేసుకునేవరకూ వచ్చింది. అప్పటికీ ఒక పెళ్లి మాత్రమే అయిందనుకున్న నాగరాజు… పట్టించుకోకుండా పెళ్లి చేసుకున్నాడు.,
కానీ .. కొన్ని రోజులు బాగానే ఉన్నా.. నాగరాజు మొహం మెత్తేశాడేమో కానీ.. ఇతురలతో పరిచయం పెంచుకుని వారితో సన్నిహితంగా మెలగడం ప్రారంభించారు. నాగరాజు ఎంత చెప్పినా వినలేదు. ఎప్పుడు చూసినా ఎవరితో ఒకరితో సన్నిహితంగా ఉంటూండటంతో.. తట్టుకోలేక నాగరాజు గొంతు కోసి చంపేసి.. పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసులు వరలక్ష్మి వివరాలన్నీ బయటకు తీసేసరికి.. ఇలా ఆమె చేసుకున్న పెళ్లిళ్ల సంఖ్య తొమ్మిదిగా లెక్క తేలింది. ఎవరినైనా పెళ్లి చేసుకోవడం.. ఒకటి .. రెండు నెలల తర్వాత ఇతరులపై మోజుపడటం.. కామన్‌గా మారిపోయింది. వివాహేతర బంధాలే కాదు.. నేరుగా పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడుతుంది. చివరికి.. తొమ్మిదో భర్త నాగరాజు చేతిలో ప్రాణాలు కోల్పోయింది.