మాతృభాష.. గీతృభాష జాన్తా నై.. అంతా ఆంగ్రేజీ హై అంటూ… న్యాయవ్యవస్థను సైతం తొక్కేసుకుంటూ వెళ్లిపోతున్న ఏపీ సర్కార్కు ఇప్పుడు.. ఎదురు కేంద్ర ప్రభుత్వమే వచ్చి అడ్డం నిలబడింది. ఐదో తరగతి వరకూ.. ఇంకా చెప్పాలంటే.. ఎనిమిదో తరగతి వరకూ మాతృభాషలోనే విద్యాబోధన ఉండాలని.. స్పష్టంగా .. సూటిగా.., సుత్తి లేకుండా.. కొత్త విధానం తీసుకొచ్చేసింది. దీంతో ఇంగ్లిష్ మీడియం అంటూ … హడావుడి చేస్తున్న ప్రభుత్వానికి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. ఇప్పటి వరకూ విద్యాహక్కు చట్టం దగ్గర్నుంచి రాజ్యాంగం వరకూ దేన్ని పరిగణనలోకి తీసుకోకుండా… వాలంటీర్లతో అఫిడవిట్లు కూడా తీసుకున్న సర్కార్.. ఇప్పుడు వాటన్నింటినీ ఏం చేయాలా.. అని ఆలోచించాల్సిన పరిస్థితి.
అధికారం చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఓ ఫైన్ మార్నింగ్… ఎందుకో.. తెలుగు వల్ల.. పిల్లలు వెనుకబడిపోతున్నారని అనిపించింది. ఇంగ్లిష్ వస్తేనే జీవితంలో ఎదిగిపోతారని అనుకున్నారు. ఈ తెలుగు లేకపోతే.. సమస్యే ఉండదని అనుకున్నారు. అంతే.. అప్పటికప్పుడు.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలుగు మీడియంను రద్దు చేసేస్తున్నానని ప్రకటించారు. ఒక్క ఇంగ్లిష్ మీడియం మాత్రం.. తెలుగు రాష్ట్రంలో ఉంటుందని డిక్లేర్ చేసేశారు. వంధిమాగధులంతా చప్పట్లు కొట్టారు. మాతృభాష కోసమే బతుకుతున్నామని చెప్పిన వారు.. పదవులు పొందిన వారు కూడా శభాష్ అన్నారు. మాతృభాషను చంపుతూంటే.. పొగిడేశారు.
అయితే.. మాతృభాషలో ప్రాథమిక విద్యాబోధన జరిగితే మానసిక వికాసం ఉంటుందని.. శాస్త్రీయంగా తేలిన అంశాలు… తెలుగుపై మక్కువ ఉన్న కొంత మంది .. ప్రభుత్వ నిర్ణయాన్ని నరిసిస్తూ.. విమర్శలు చేశారు దీనికి ప్రభుత్వం.. జగన్ వైపు నుంచి వచ్చిన కౌంటర్… మీ పిల్లలు ఏ మీడింయంలో చదువుతున్నారు..? అనే. మీ పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదవాలి… పేద పిల్లలు తెలుగు మీడియంలో చదవాలా అని.. రాజకీయ రచ్చ. అసలు.. ఇంగ్లిష్ మీడియం పెట్టవద్దని ఎవరన్నారో చెప్పరు… ఇంగ్లిష్తో పాటు.. తెలుగు మీడియం కూడా ఉంచమనే అందరూ చెబుతున్నారు. కానీ.. ప్రభుత్వం మాత్రం.. తెలుగు పీక పిసకాల్సిందేనని డిసైడయ్యి.. ఎదురుదాడికి దిగింది. ఎంత దారుణంగా అంటే… కోర్టులు. న్యాయమూర్తుల్ని కూడా… వదిలి పెట్టలేదు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్… తీర్పులు ఇచ్చే న్యాయమూర్తులు ఏ మీడియంలో చదువుతున్నారంటూ… వైసీపీ ఆఫీసులో జరిగిన మీడియా సమావేశంలోనే ప్రశ్నించారు.
ఈ పద్దతిన ఇప్పుడు.. ఏపీ సర్కార్.. కేంద్రం పెద్దలపై ఎదురుదాడి దిగాల్సి ఉంది. మీ పిల్లలు ఏ మీడియంలో చదవుతున్నారని… ప్రశ్నిస్తూ.. తక్షణం… జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకించాల్సి ఉంది. న్యాయవ్యవస్థనే పరిగణనలోకి తీసుకోని 151 సీట్ల సీఎం.. ఇక కేంద్రాన్ని మాత్రం లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం ఏముంటుంది…? మీ విధానం మీరు పెట్టుకోండి.. మా విధానం మేం పెట్టుకుంటామని… సీఎం జగన్ నేరుగా ముందుకెళ్లే అవకాశం సమాఖ్య వ్యవస్థ అయిన భారత్లో ఉంటుంది. మరి జగన్ దీన్ని ఉపయోగించుకుంటారేమో..?