అల్లు అర్జున్ మంచి స్పీడుమీదున్నాడు. ‘పుష్ష’ పట్టాలపైకి ఎక్కలేదు.. ఈలోగా రెండు సినిమాలు ఫిక్స్ చేసుకున్నాడు. అందులో కొరటాల శివతో ఒకటి. ఈమధ్యే.. ఓ కాన్సెప్ట్ పోస్టర్ కూడా విడుదల చేశారు. దాంతో.. ఈ సినిమా కథ లాక్ అయిపోయిందన్న ప్రచారం జరిగింది. నిజానికి.. బన్నీకి కొరటాల కథే చెప్పలేదట. జస్ట్..పాయింట్, దాంతో పాటు హీరో క్యారెక్టరైజేషన్ వివరించాడట. అంతే. అది నచ్చే బన్నీ ఈ సినిమా కథేంటో వినకుండానే ప్రాజెక్టు ఒప్పుకున్నాడని తెలుస్తోంది.
అపజయం ఎరుగని దర్శకుడు కొరటాల. తన కథలన్నీ బలమైనవే. అందుకే బన్నీకి కొరటాల అంటే అంత నమ్మకం. నిజానికి బన్నీ స్టైలే అంత. దర్శకుడిపై నమ్మకం ఉంచి – ప్రాజెక్టు ఓకే చేసేస్తాడు. ఆ తరవాత కథ దానంతట అదే పుట్టుకొస్తుందన్న ధీమా బన్నీది. `అల వైకుంఠపురములో` ఒప్పుకునే ముందు బన్నీ కథేం వినలేదు. బన్నీ – త్రివిక్రమ్ ఓ టీమ్ గా ఏర్పడ్డాక.. కథ అల్లుకున్నారు. `పుష్ష`కి ముందు కూడా అంతే. మహేష్ కాదన్న తరవాత. కథేమిటో తెలియకుండానే సుకుమార్ ని పిలిపించి `ఈ సినిమా మనం చేద్దాం` అంటూ మాట ఇచ్చేశాడు. కొరటాల తరవాత బన్నీ మరోసారి త్రివిక్రమ్ తో ఓ ఓ సినిమా చేయబోతున్నాడు. అది కనీసం లైన్ గా కూడా లేదు. కేవలం త్రివిక్రమ్ పై ఉన్న నమ్మకంతో.. ఈ ప్రాజెక్టు ఓకే చేసేశాడు. ఓ స్టార్ హీరో.. కథకంటే దర్శకుల్ని నమ్మడం, కథ రెడీ కాకుండానే.. సినిమాల్ని ఓకే చేసేయడం విభిన్నమైన స్ట్రాటజీనే.