కరోనా మహమ్మారి విశ్వరూపం చూపిస్తోంది. ఇప్పుడు టాలీవుడ్ లోనూ తిష్ట వేసుకుని కూర్చుంది. రాజమౌళి కుటుంబ సభ్యులకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. తేజ కీ కరోనా పాజిటీవ్ అని నిర్దారణ అయ్యింది. ఇప్పుడు హాస్యనటుడు పృథ్వీరాజ్‌కి సైతం కరోనా సోకింది. గత వారం పది రోజుల నుంచీ ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎందుకైనా మంచిదని కరోనా టెస్టులు చేయిస్తే.. నెగిటీవ్ వచ్చింది. కానీ కరోనా లక్షణాలు మాత్రం కనిపించాయి. నెటిటీవ్ వచ్చినా – కొంతమందిలో కరోనా ఉండొచ్చని వైద్యులు చెప్పడంతో, సోమవారం రాత్రి ఆయన హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చేరిపోయారు. ఈ విషయాన్ని ఫృథ్వీనే సోషల్ మీడియాలో స్వయంగా వెల్లడించారు. తను త్వరలోనే కోలుకుంటానని, అందుకు ప్రేక్షకుల ఆశీర్వాదాలు, భగవంతుడి ఆశీస్సులు కావాలన్నారు.