మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పదహారో తేదీన జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరేందుకు ముహుర్తం ఖరారు చేసుకున్నారు. విజయసాయిరెడ్డికి… సంబంధం లేకుండా.. ఆయన పార్టీలో నెంబర్ టూగా లెటెస్ట్‌గా ఎదిగిన సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా వైసీపీలో చేరుతున్నారు. గంటాను ఇంత కాలం పార్టీలోకి రాకుండా అడ్డుకుంటున్న మంత్రి అవంతి శ్రీనివాస్‌కు … ఈ వ్యవహారం… ఇబ్బందికరంగా మారింది. అందుకే.. గంటా పార్టీలోకి రాక ముందే విమర్శలు ప్రారంభించారు. కేసుల మాఫీ కోసం గంటా వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారని నేరుగా ఆరోపణలు గుప్పించారు. అంతే కాదు.. గంటా దొడ్డిదారిన వైసీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని తేల్చారు.
అంటే.. విజయసాయిరెడ్డితో సంబంధం లేకుండానే చేరుతున్నట్లుగా పరోక్షంగానే అవంతి అంగీకరించినట్లయింది. అధికారం ఎక్కడ ఉంటే గంటా శ్రీనివాసరావు అక్కడ ఉంటారని … అధికారం లేకపోతే ఉండలేరని మండిపడుతు్ననారు. సైకిళ్లు, భూ కుంభకోణాల్లో గంటా..ఆయన అనుచరులు ఉన్నారని… ఆ కుంభకోణాలను విజయసాయిరెడ్డికి చెప్పానని అవంతి చెప్పుకొచ్చారు. గతంలో గంటాపై మంత్రివర్గ సహచరుడే ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. గంటా శ్రీనివాసరావు.. టీడీపీ తరపున గెలిచినప్పటికీ.. ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. కొన్నాళ్ల నుంచి వైసీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నా… విజయసాయిరెడ్డి ద్వారా అవంతి పడనీయలేదు. కానీ ఇప్పుడు సీన్ మారింది.
గంటా వస్తే.. విశాఖలో వైసీపీ మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకుంటారన్న చర్చ నడుస్తోంది. తన మంత్రి పదవికి ఎక్కడ ఎసరు వస్తుందోనని… అంతి కంగారు పడుతున్నారు. అందుకే విమర్శలు చేస్తున్నారు. నిజానికి గంటా , అవంతి ఒకప్పుడు మంచి స్నేహితులు. పీఆర్పీలో కలిసి పోటీ చేసి.. గెలిచారు. తర్వాత మూకుమ్మడిగా కాంగ్రెస్‌లోకి వెళ్లారు.. అలాగే టీడీపీలోకి వెళ్లారు. కానీ తర్వాతే అవంతి తన దారి తాను చూసుకున్నారు.