ప్రస్తుతం శ్రీకారం సినిమాతో బిజీగా ఉన్నాడు శర్వానంద్. మరోవైపు `మహా సముద్రం` సినిమా ఒప్పుకున్నాడు. ఇప్పుడు శర్వానంద్ చేతిలో మరో ప్రాజెక్టు చేరింది. శ్రీవెంకటేశ్వర సినిమాస్ సంస్థలో ఓ సినిమా చేయడానికి శర్వా సంతకాలు చేశాడు. నారాయణ్ దాస్,పుష్కర్ రామ్ నిర్మాతలు. ఇటీవల.. నిఖిల్ 20వ సినిమాని ప్రకటించారు. ఆ చిత్రానికి నిర్మాతలు వీళ్లే. ఇప్పుడు శర్వానంద్ సినిమాని పట్టాలెక్కించబోతున్నారు. దర్శకుడు, ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటిస్తారు. ఏసియన్ సినిమా పతాకంపై నారాయణ్ దాస్ `లవ్ స్టోరీ`ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకుడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే.. శేఖర్ కమ్ములతో మరో సినిమా చేయబోతున్నారు నారాయన్ దాస్.