అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ చూసేలా.. ఏర్పాట్లు చేశారు. చివరికి న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లోనూ… ప్రసారం చేశారు. అయితే.. అనూహ్యంగా… తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీవేంకటేశ్వర భక్తి చానల్లో మాత్రం.. దాని గురించి కనీస మాత్రం పట్టించుకోలేదు. మహోన్నత ఘట్టాన్ని కొద్ది సేపు కూడా చూపించలేదు. దాదాపుగా.. అన్ని న్యూస్ చానళ్లలో వస్తూంటే.. ఎస్వీబీసీని ఎవరూ చూడలేదమో కానీ.. బీజేపీ నేతలు మాత్రం పట్టేసుకున్నారు. ప్రభుత్వంపై విమర్శలు ప్రారంభించారు. బీజేపీ యువనేత విష్ణువర్ధన్ రెడ్డి ఈ అంశంలో దూకుడుగా వెళ్తున్నారు.
అయోధ్య రామాలయం భూమి పూజ అంటే.. భక్తి చానళ్లకు పండగే. ఎన్నెన్నో విశేషాలను చూపించడానికి చాన్స్ ఉంటుంది. ఇతర ప్రైవేటు భక్తి చానళ్లు ఇప్పటికీ అదే మూడ్‌లో ఉన్నాయి. కానీ ఎస్వీబీసీ మాత్రం తమకేమీ సంబంధం లేనట్లుగా వ్యవహరించింది. కావాలనే ఉద్దేశ పూర్వకంగా అయోధ్య రామాలయ భూమిపూజను ప్రత్యక్ష ప్రసారం ఇవ్వలేదనే ఆరోపణలను బీజేపీ నేతలు చేస్తున్నారు. ఓ ఎజెండా ప్రకారం… ఎస్వీబీసీ సీఈవో పని చేస్తున్నారని.. ఆయనను తక్షణం తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రపంచంలోనే 250 చానళ్లు లైవ్ ఇస్తే.. ఎస్వీబీసీ మాత్రం ఇవ్వలేదంటున్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శారదాపీఠం వెళ్తే ప్రత్యక్ష ప్రసారాలు పెట్టిందని… అయోధ్య రామాలయ భూమి పూజ అంత కంటే… చిన్నదా.. అని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఎస్వీబీసీ చుట్టూ మొదటి నుంచి అనేక వివాదాలు ముసురుకుంటున్నాయి. ఫృధ్వీ చైర్మన్ గా ఉన్నప్పుడు.. ఉద్యోగులను వేధించి… పదవి పోగొట్టుకున్నారు. ఆ తర్వాత పలువురు కొత్తవారిని తీసుకొచ్చారు. అయితే… అయోధ్య రామాలయ భూమిపూజ.. పత్యక్ష ప్రసారం ఇవ్వకపోవడం అనేది ఉద్దేశపూర్వకంగా.. పెద్దగా చెబితేనే చేసినట్లుగా భావిస్తున్నారు. అలాంటి కార్యక్రమం ఇవ్వకపోతే.. ఇక భక్తి చానల్‌కు అర్థం ఏముందన్న ప్రశ్న… భక్తుల నుంచి వస్తోంది.