నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు కేంద్ర బలగాలు రక్షణ కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తనకు వై కేటగిరి సెక్యూరిటీ కల్పించినట్లుగా సమాచారం అందిందని.. అధికారిక ఆదేశాలు ఒకటి రెండు రోజుల్లో వస్తాయని రఘురామకృష్ణరాజు మీడియాకు సమాచారం ఇచ్చారు. ఈ సెక్యూరిటీ కింద.. పదకొండు మంది కేంద్ర బలగాలతో రక్షణ ఉంటుంది. ఒకరు లేదా ఇద్దరు కమాండోస్ వీరిలో ఉంటారు. రాష్ట్ర పర్యటనకు వస్తే.. వై కేటగిరి ప్రోటోకాల్ ప్రకారం.. రాష్ట్ర బలగాలు రక్షణ కల్పించాల్సి ఉంటుంది.
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తనకు వైసీపీ నేతలు, కార్యకర్తల నుంచి ప్రాణహాని ఉందని.. కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. న్యాయస్థానాని.. ఇంటలిజెన్స్ బ్యూరో రిపోర్ట్ రాగానే.. సెక్యూరిటీ కల్పిస్తామని… కేంద్రం హామీ ఇచ్చింది. ఇప్పుడు నివేదిక వచ్చిందో కానీ.. సెక్యూరిటీ కల్పించే దిశగా చర్యలు తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఇటీవలి రాజకీయ పరిణామాల్లో.. ఆయన వైసీపీ నాయకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దాంతో నర్సాపురంలో పర్యటిస్తే దాడులు చేస్తామని పలువురు వైసీపీ నేతలు హెచ్చరించారు.
నర్సాపురంలో దిష్టిబొమ్మలు తగులబెట్టారు. ఈ కారణంతో.. తన భద్రతపై ఆందోళనతో ఉన్నారు. గతంలో.. స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పైనా.. వైసీపీ నేతలు అదే తరహాలో దాడులు చేస్తామన్నట్లుగా ప్రకటనలు చేశారు. దాంతో ఆయన కూడా.. కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. తనకు కేంద్ర భద్రతా బలగాలతో రక్షణ కావాలని కోరారు. కేంద్ర హోంశాఖ ఆ మేరకు ఆయనకు రక్షణ కూడా కల్పించింది. ఇప్పుడు సొంత అధికార పార్టీకి చెందిన ఎంపీకి కేంద్రం భద్రత కల్పిస్తోంది. హోంశాఖ సహాయ మంత్రిషన్ రెడ్డి కూడా.. ఏపీలో పోలీసు రాజ్యం.. దౌర్జన్యం నడుస్తోందని ఏపీ పర్యాటకు వచ్చినప్పుడు విమర్శలు చేశారు. ఈ పరిణామాలన్నీ ఏపీలో శాంతిభద్రతలపై కొత్త సందేహాలు లేవనెత్తేలా చేస్తున్నాయి.