యూవీ క్రియేషన్స్ పేరు చెప్పగానే సాహో, రాధేశ్యామ్ లాంటి భారీ చిత్రాలు గుర్తొస్తాయి. అయితే ప్రస్తుతం యూవీ చిన్న సినిమాలవైపు దృష్టి పెట్టింది. ఒకేసారి నాలుగైదు చిన్న సినిమాల్ని పట్టాలెక్కించే పనిలో ఉంది. ఇప్పటికే కొన్ని కథలు లాక్ అయ్యాయి. అయితే యూవీకి మరి కొన్ని కథలు కావల్సివచ్చాయి. అందుకే కథల వేటలో పడింది. వర్థమాన రచయితల్ని పిలిపించి.. మరీ కథలు వింటోందట. సుజిత్ ఇప్పటికే కొంతమంది యువ రచయితల్ని యూవీకి పంపాడు. రాధాకృష్ణ (రాధేశ్యామ్ దర్శకుడు) కూడా తన వంతుగా కొన్నికథలు వినిపించాడట. కనీసం మరో అరడజను చిన్న కథల్ని యూవీ రెడీగా ఉంచాలని భావిస్తోంది. లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో పెద్ద స్టార్లతో సినిమాలు తీయడం ఆషామాషీ వ్యవహారం కాదు. పైగా హీరోలంతా తమతమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇలాంటప్పుడు చిన్న సినిమాలే నయం అన్నది యూవీ ఉద్దేశం. రాధ్యే శ్యామ్ తరవాత… కొన్నాళ్లు పెద్ద సినిమాల జోలికి వెళ్లకపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.