అభివృద్ధి వికేంద్రీకణలో భాగంగానే అమరావతిని రాష్ట్రం మధ్యలో పెట్టామని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. రాజధానిపై వైసీపీ నేతల ద్వంద్వ వైఖరిని మరోసారి మీడియా ముందు పెట్టారు. ఎన్నికలకు ముందు అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని చెప్పి మోసం చేశారని … రాజధానిని కాపాడుకోవడం అందరి బాధ్యతనిచ చంద్రబాబు గుర్తు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగమే అమరావతి ఏర్పాటు చేశామని..ఇతర ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టామో…చంద్రబాబు వివరించారు. రాజధానిపై కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీకి 50 శాతం కంటే ఎక్కువ మంది ప్రజలు విజయవాడలో రాజధాని ఉండాలని అభిప్రాయం చెప్పారన్నారు. 160 ప్రాజెక్టులను అన్ని జిల్లాలకు ప్రకటించామని 160 ప్రాజెక్టులను పూర్తి చేస్తే.. అదే అభివృద్ధి వికేంద్రీకరణ అని చంద్రబాబు స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో హైటెక్ సిటీ ఏర్పాటు తర్వాత హైదరాబాద్‌లో అనేక ప్రాజెక్టులు వచ్చాయని … ఇప్పడు హైదరాబాద్ తెలంగాణకు ఆయువు పట్టుగా మారిందని గుర్తు చేశారు. ప్రస్తుతం దక్షిణ రాష్ట్రాల్లో తక్కువ ఆదాయం వచ్చే రాష్ట్రం ఏపీ ఒక్కటేననని.. ప్రభుత్వానికి ఆదాయం కల్పించే ప్రాజెక్టు అమరావతి అని చంద్రబాబు గుర్తు చేశారు. అమరావతిని ధ్వంసం చేస్తే ఆదాయం ఎలా వస్తుందనిప్రశఅనించారు. విశాఖలో ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని ..గంగవరం పోర్టును తానే తీసుకొచ్చానని …విశాఖ ఇప్పటికే ఫార్మా రాజధానిగా ఉందన్నారు. టూరిజం హబ్‌గా తీర్చిదిద్దామన్నారు.
వైసీపీ నాయకులకు ఏ ఎండకు ఆ గొడుగు పట్టి భజన చేయడం తప్ప.. అభివృద్ధి చేయడం రాదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి నా స్వార్థం కోసం కాదు.. ప్రజల కోసమన్నారు. నన్ను ఏం చేయలేక.. తనపై కులుం ముద్ర వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి మనందరి బాధ్యత అని ప్రజలు గుర్తు పెట్టుకోవాలని … ఇప్పుడు పోరాడకపోతే.. మనం తీవ్రంగా నష్టపోతామని ప్రజలకు పిలుపునిచ్చారు.