పూరి సినిమాల్లో డైలాగులు ఎంత పవర్ఫుల్ గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సూటిగా, గుండెని తాకేలా రాయగలడు. అవన్నీ సినిమాలకే పరిమితం కాదు. తన జీవన శైలే అలా ఉంటుంది. పూరి ఎప్పుడు, ఎక్కడ మాట్లాడితే తన భావజాలం స్పష్టంగా కనిపిస్తుంటుంది. దాన్ని పూరి అభిమానులు `పూరీఇజం` అంటుంటారు.
తాజాగా.. పాడ్ కార్డ్స్ పేరుతో.. పూరి కొన్ని కొటేషన్లు చెబుతున్నాడు. స్నేహం, డబ్బు, స్వార్థం, దేవుడు, ప్రేమ, బ్రేకప్ .. ఇలా రకరకాల టాపిక్కుల మీద మాట్లాడుతున్నాడు. ఇవి కూడా పూరి అభిమానులకు తెగ నచ్చేస్తున్నాయి. ఇందులో పూరి భావజాలం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. త్వరలో ఈ కొటేషన్లని పుస్తక రూపంలోకి తీసుకువస్తున్నాడు పూరి. అందుకు సంబంధించిన సన్నాహాలు మొదలయ్యాయి కూడా. లాక్ డౌన్సమయం, పైగా షూటింగులు లేవు. పుస్తక రచనకు ఇదే అనువైన సమయం. పాడ్ కార్డ్స్ లో పొందుపరచిన భావాల్ని అక్షరాలలో చూడాలంటే… ఈ పుస్తకం వచ్చేంత వరకూ ఎదురు చూడాల్సిందే.