వాల్ పోస్టర్ బ్యానర్ స్థాపించి ‘అ’ సినిమాతో బోణీ కొట్టాడు నాని. నిర్మాతగా తన అభిరుచి ఎలాంటిదో తొలి సినిమాతోనే చూపించాడు. ప్రశాంత్ వర్మని దర్శకుడిగా పరిచయం చేశాడు. ‘అ’ కమర్షియల్ గా సేఫ్ ప్రాజెక్టు. ఓ కొత్త సినిమా చూశామన్న అనుభూతి ప్రేక్షకులకు కలిగింది. విమర్శకులూ మెచ్చుకున్నారు. అవార్డులూ దక్కాయి. ఇప్పుడు `అ` సినిమాకి సీక్వెల్ రాబోతోంది. ‘ఆ 2’ కి సంబంధింని స్క్కిప్టుని ప్రశాంత్ వర్మ ఎప్పుడో సిద్ధం చేశాడు. ప్రస్తుతం ‘జాంబీ రెడ్డి’ సినిమాతో బిజీగా ఉన్నాడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమా పూర్తయ్యాకే `అ 2` పట్టాలెక్కుతుంది. “అ ని హిందీలో రీమేక్ చేయమని అడిగారు. ఆ 2 కూడా హిందీలోనే తీయాలనుకున్నాం.కానీ. ముందు తెలుగులో నిరూపించుకున్న తరవాత.. బాలీవుడ్ రీమేక్ గురించి ఆలోచిస్తా“ అంటున్నాడు ప్రశాంత్ వర్మ. తన దగ్గర 32 కథలు సిద్ధంగా ఉన్నాయట. అందులో అగ్ర హీరోలకు సరిపడా స్క్కిప్టులు కూడా ఉన్నాయని చెబుతున్నాడు. `జాంబీ రెడ్డి` హిట్టయితే… తప్పకుండా పెద్ద హీరోల నుంచి ఛాన్సులు రావొచ్చు.