ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి పెద్ద పీట వేస్తోంది. పరిశ్రమలు పెట్టాలనుకునేవారి… అనేకానేక ప్రోత్సాహకాలతో కొత్త పాలసీ ప్రవేస పెట్టింది. భారీగా పెట్టుబడులు పెట్టే వారికి భారీ రాయితీలు ఇవ్నున్నారు. వచ్చే మూడేళ్ల కోసం పాలసీని ప్రకటించారు. ముఖ్యంగా మహిళా పారిశ్రామికవేత్తల కోసం.. అదనపు ప్రోత్సహకాలు కల్పించారు. పెట్టుబడులు పెట్టినవారు నష్టపోకుండా పూర్తిగా హ్యాండ్ హోల్డింగ్ అందించే విధానాన్ని కూడా ప్రభుత్వం ప్రవేశ పెడుతోంది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు ప్రకటించారు. 10 మందికి ఉపాధి కల్పించేలా మహిళా పారిశ్రామికవేత్తలు పరిశ్రమ పెట్టేందుకు ముందుకు వస్తే వారికి సగం ధరకే భూమి, స్టాంప్ డ్యూటీ నుంచి మినహాయింపు, ఐదేళ్లపాటు విద్యుత్ సబ్సిడీతోపాటు అనేక రాయితీలు కల్సిస్తారు. ఎంఎస్ఎంఈలకు 100 శాతం స్టాంప్ డ్యూటీ, ఐదేళ్లపాటు 100 శాతం ఎస్‌జీఎస్టీ కూడా మినహాయింపు ఇస్తున్నారు. వడ్డీ రాయితీ, విద్యుత్ సబ్సిడీ, నాలా చార్జీల్లో కూడా రాయితీ వస్తుంది. ఇక 2 వేల మందికిపైగా ఉపాధి కల్పించే పరిశ్రమలకు వంద శాతం.. వెయ్యి నుంచి రెండు వేల మందికి ఉపాధి కల్పిస్తే 75 శాతం.. 1,000 మంది వరకు ఉపాధి కల్పిస్తే 50 శాతం జీఎస్టీ నుంచి మినహాయింపు ప్రకటించారు.
ఇక భారీ పెట్టుబడులకు అనుగుణంగా అదనపు రాయితీలు ఇస్తున్నారు. పారిశ్రామిక పార్కుల్లో 16.2 శాతం ఎస్సీలకు, 6 శాతం ఎస్టీలకు కేటాయిస్తారు. స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు కల్పించాలనే నిబంధన తెచ్చినందున… స్కిల్డ్ లేబర్ కోసం.. కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొంటాయి. అందుకే అలాంటి పరిస్థితి లేకుండా.. 30 నైపుణ్య శిక్షణ కేంద్రాలు, రెండు స్కిల్డ్ వర్సిటీలు, డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌ఛేంజ్‌ని ఏర్పాటు చేస్తారు. పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందించేందుకు “వైఎస్సార్ ఏపీ వన్” పేరిట సింగిల్ విండో కేంద్రం కూడా ఏర్పాటు చేస్తున్నారు.