ఆచార్య తరవాత.. భారీ లైనప్ అట్టి పెట్టుకున్నాడు చిరంజీవి. ఓ వైపు బాబీకి ఓకే చెప్పిన చిరు, మరోవైపు మెహర్ రమేష్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇంకోవైపు వినాయక్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆచార్య నుంచి.. వినాయక్ వరకూ వెళ్లాలంటే.. కనీసం రెండు మూడేళ్లు పట్టాలి. కానీ.. చిరు మాస్టర్ ప్లాన్ వేరుగా ఉంది. ఆచార్య తరవాత.. ఒకేసారి రెండు ప్రాజెక్టుల్ని పట్టాలెక్కించాలన్నది చిరు ప్లాన్. ఆచార్య ముగిసిన వెంటనే.. మెహర్ రమేష్ `వేదాళం` రీమేక్ పట్టాలెక్కుతుంది. `వేదాళం` మొదలైన నెలరోజుకే.. బాబీ సినిమానీ మొదలెట్టాలన్నది చిరు ప్లాన్. ఆగస్టు 22న చిరు పుట్టిన రోజు సందర్భంగా మెహర్ రమేష్ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. నిజానికి బాబీ సినిమానే చిరు ముందుగా మొదలెట్టాలి. అయితే.. మెహర్ రమేష్ `వేదాళం` స్క్రిప్టుని పూర్తి స్థాయిలో సిద్ధం చేసేసినట్టు సమాచారం. బాబీ కథ స్క్రిప్టు రూపంలో మారడానికి ఇంకొంచెం సమయం ఉందని తెలుస్తోంది. అందుకే ముందుగా వేదాళం మొదలెట్టి, ఆ తరవాత.. బాబీ సినిమానీ పట్టాలెక్కించాలని భావిస్తున్నాడు చిరు. మెగాస్టార్ అయ్యాక.. ఒకేసారి సమాంతరంగా రెండు సినిమాల్ని నడిపించలేదు చిరు. అయితే ఇప్పుడు ఆ అవసరం, అవకాశం వచ్చాయి. కాబట్టి ఈ రేర్ ఫీట్ కి చిరు సిద్ధమైనట్టు టాక్.