ఉగాదికి రావాల్సిన సినిమా ‘వి.` నాని, సుధీర్ బాబు కథానాయకులుగా నటించిన ఈ చిత్రానికి ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకుడు. లాక్ డౌన్ వల్ల.. అన్ని సినిమాలతో పాటు `వి` కూడా వాయిదా పడుతూ వస్తోంది. మధ్యలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా దిల్ రాజు మెట్టు కూడా కిందకి దిగి రాలేదు. ఇప్పుడు మాత్రం అమేజాన్ తో బేరం కుదిరిపోయిందని టాక్. ‘వి’ సెప్టెంబరు 5న `వి` అమేజాన్ లో స్ట్రీమింగ్ కాబోతోందన్నది లేటెస్ట్ న్యూస్. అందుకు సంబంధించిన ఒప్పందాలు కూడా జరిగిపోయాయని సమాచారం. బడ్జెట్‌కి మించి.. అమేజాన్ ఆఫర్ చేయడం వల్లే… `వి`ని ఇచ్చేశారని తెలుస్తోంది. ఈ సినిమాకి దాదాపు 25 కోట్ల వరకూ ఖర్చు పెట్టారని తెలుస్తోంది. అమేజాన్ 33 కోట్లకు ఆఫర్ చేసిందట. దిల్ రాజుదంతా లెక్కలతో నడిచే వ్యవహారం. వీలైనంత వరకూ థియేటరికల్ రిలీజ్ కోసమే ఆగారు. కానీ.. థియేటర్లు తెరవకపోవడంతో, వడ్డీల భారం నుంచి తప్పించుకోవడానికి ఇంతకంటే మంచి మార్గం లేదు. ఇప్పటి వరకూ వచ్చిన ఆఫర్లతో పోలిస్తే.. అమేజాన్ కోడ్ చేసిన ఆఫర్ చాలా ఎక్కువని తెలుస్తోంది. అందుకే.. దిల్ రాజు అటువైపు మొగ్గు చూపించార్ట. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకట వస్తోంది.