అమరావతి మార్పు గురించి ప్రస్తావన లేని పిటిషన్పై వేసే అఫిడవిట్లలో అటు కేంద్రం..ఇటు ఏపీ…రాజధాని మార్పు గురించి తమ విధానానని హైకోర్టులో చెప్పడం… ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 2018 మార్చి 29న విభజన చట్టాన్ని సరిగ్గా అమలు చేయడం లేదని పోలూరి శ్రీనివాసరావు తరఫున న్యాయవాది పీవీ కృష్ణయ్య ఓ పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గత వారం.. అఫిడవిట్ దాఖలు చేసింది. అసలు పీవీ కృష్ణయ్య దాఖలు చేసిన పిటిషన్లో రాజధాని ఎవరి పరిధిలోది అన్న టాపిక్ లేదు. అయినా కేంద్రం… పని కల్పించుకుని మరీ.. రాజధాని అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని చెప్పుకొచ్చింది.
వెంటనే ఏపీ ప్రభుత్వం కూడా… ఈ అంశాన్ని అంది పుచ్చుకుంది. రాజధాని నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని తన అఫిడవిట్లో చెప్పింది. హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో కేంద్రం కూడా ఇదే విషయాన్ని తెలిపిందని… గుర్తు చేసింది. రాజధాని సహా అభివృద్ధి ప్రణాళికలు.. వివిధ ప్రాజెక్టులు సమీక్షించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. ఈ పిటిషన్లో విభజన హామీలు కీలకమైన అంశం. కేంద్రం తాము విభజన హామీలు అన్నీ అమలు చేశామని చెప్పింది.
ప్రత్యేకహోదా ఇవ్వలేమని తేల్చేసింది. అయితే.. ఏపీ సర్కార్ మాత్రం.. తాను దాఖలు చేసిన అఫిడవిట్లో రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని .. పార్లమెంట్ సాక్షిగా కేంద్రం వాగ్ధానం చేసిందిని .. ప్రత్యేక హోదా అమలుకానంతవరకు .. విభజన ప్రక్రియ అసంపూర్తిగానే మిగిలిపోయిందని భావించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చింది. హైకోర్టులో ఉన్న పిటిషన్లో అవసరం లేకపోయినా… రాజధాని తరలింపు అధికారాల గురించి అటు కేంద్రం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం అఫడవిట్లు దాఖలు చ ేయడం ఆసక్తికరంగా మారింది.