హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి టెండర్లు ఎట్టకేలకు ఖరారయ్యాయి. ఎల్ అండ్ టీ సంస్థ రెండు ప్యాకేజీలను, షాపూర్జీ పల్లోంజీ సంస్థ ఒక ప్యాకేజిని గెలుచుకున్నాయి. ఎల్ అండ్ టీ సంస్థ 4 భవనాలను, షాపూర్జీ పల్లోంజీ సంస్థ 2 భవనాలను నిర్మించనున్నాయి. చదరపుటడుగుకు రు.3,350 చొప్పున నిర్మాణానికి ఈ రెండు సంస్థలూ అంగీకరించాయి. ఒక్కో భవనంలో లక్ష చదరపుటడుగుల బిల్ట్ అప్ ఏరియా ఉంటుంది. జీ+1 తరహాలో నిర్మిస్తారు. జూన్ 15 నాటికి నిర్మాణాన్ని పూర్తి చేస్తాయి. టెండర్ల ప్రక్రియ పూర్తి కావటంతో రేపటి క్యాబినెట్ సమావేశంలో చర్చించి త్వరలో శంకుస్థాపన చేసి నిర్మాణానికి శ్రీకారం చుట్టనుంది. గత వారంరోజులుగా టెండర్ల ఖరారుపై చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం నిర్ణయించిన ధరకంటే ఈ రెండు కంపెనీలు మొదట ఎక్కువ కోట్ చేశాయి.