హైదరాబాద్: ‘నాన్నకు ప్రేమతో’ వంటి మంచి విజయాన్ని సాధించిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘జనతా గ్యారేజ్’ అనే చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత జూనియర్ మూడేళ్ళపాటు వెండితెరకు దూరం కాబోతున్నారని వార్తలొస్తున్నాయి. ‘బాహుబలి 2’ తర్వాత రాజమౌళి తీయబోయే ‘గరుడ’లో జూనియరే హీరో అని, ఆ చిత్రానికిగానూ మూడేళ్ళపాటు డేట్స్ అడిగారని చెబుతున్నారు. జూనియర్ కూడా దానికి అంగీకరించి మూడేళ్ళ సమయాన్ని గరుడకు కేటాయించేందుకు సిద్ధమయ్యారట. గరుడ సినిమాకు బాహుబలికి మించిన సమయం, వనరులు కావాలని రాజమౌళి గతంలోనే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కూడా చారిత్రకమేనట. అయితే ఈ చిత్రం విడుదలయ్యేది మాత్రం 2019 లేదా 2020 సంవత్సరంలోనేనట. మరి రాజమౌళి-మహేష్ కాంబినేషన్లో ఒక చిత్రం వస్తుందని ఆ మధ్య అన్నారు. అది ఇప్పుడు లేనట్లేనా?