రాజధాని అమరావతి కోసం రైతులు ఇచ్చిన పొలాలను ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయాలన్న ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులోనూ ఎదురు దెబ్బ తగిలింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. స్టే కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టి వేసింది. ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల స్థలాల పంపిణీ కోసం… రాజధాని గ్రామాల బయట లబ్దిదారులకు.. స్థలాలు పంపిణీ చేయడానికి రాజధాని కోర్ క్యాపిటల్ పరిధిలోని గ్రామాల్లో మార్కింగ్ కూడా చేశారు. ఆ భూముల్లో ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం చట్ట విరుద్దమని.. పలు పిటిషన్లు దాఖలు కావడంతో విచారణ జరిపిన హైకోర్టు రాజధాని మాస్టర్ ప్లాన్లో మార్పులు చేస్తూ గృహ నిర్మాణ జోన్ )పై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. ఈ ఉత్తర్వులపై స్టే కోసం.. ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించంది.
సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో ధర్మాసనం.. అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీ, ఆర్ 5 జోన్ విషయంలో హైకోర్టు ఉత్తర్వులను సమర్థించించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. హైకోర్టు విచారణ సరిగానే జరిగిందని ధర్మాసనం వ్యాఖ్యానించారు. హైకోర్టులో కేసు తుది విచారణ ముగించాలని సూచించింది. సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పడంతో.. హైకోర్టులో విచారణ పూర్తయ్యే వరకూ.. అమరావతి కోసం రైతులు ఇచ్చిన భూముల్ని ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయడానికి అవకాశం లేదు.
అమరావతి కోసం రైతులు ఇచ్చిన భూములను ఎలాగైనా ఇళ్ల స్థలాల కోసం పంచాల్సిందేనని ఏపీ సర్కార్ చాలా ప్రయత్నాలు చేసింది. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి.. ఇళ్ల స్థలాలకు భూముల్ని చదును చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దాని ప్రకారం.. సీఎంవో అధికారి ప్రవీణ్ ప్రకాష్ దగ్గరుండి స్థలాల్ని చదును చేయించారు కూడా. మేరకు గుంటూరు, విజయవాడల్లో… ఇళ్ల స్థలాల కోసం ధరఖాస్తు చేసుకున్న వారి దగ్గర నుంచి.. రాజధానిలో భూమి తీసుకోవడానికి తమకేమీ అభ్యంతరం లేదన్న అంగీకార పత్రాలను.. వాలంటీర్లు తీసుకున్నారు. ఆర్ -5 జోన్ మార్పుపై అభిప్రాయసేకరణ కూడా చేపట్టారు. ఇప్పుడు హైకోర్టులోనే తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.