ఈ లాక్ డౌన్ సమయంలో… శిరీష్ కొత్త కళ నేర్చుకున్నాడు. బాక్సింగ్ లో ప్రావీణ్యం సంపాదించుకున్నాడు. అయితే ఇదేం సినిమా కోసం కాదు. స్వతహాగా శిరీష్ కి బాక్సింగ్ అంటే ఇష్టం. అందుకే… నేర్చుకున్నాడట. “చిన్నప్పటి నుంచీ నాకు స్పోర్ట్స్ అంటే ఇష్టం. బాక్సింగ్ నేర్చుకుందామని అనుకునేవాడ్ని. కానీ కుదర్లేదు. అందుకే ఈ లాక్ డౌన్ సమయంలో బాక్సింగ్ నేర్చుకున్నా“ అని చెప్పుకొచ్చాడు. ఈ లాక్ డౌన్ సమయంలో… నాలుగు కథలు విన్నాడట శిరీష్. అందులో రెండు ఫైనలైజ్ చేశాడట. “లాక్ డౌన్ సమయంలో ఇంటి పట్టునే ఉన్నా. నాలుగు కొత్త కథలు విన్నా. రెండు ఫైనల్ చేశా. ఓటీటీకి పెద్ద ఫ్యాన్ కాదు నేను. సినిమా అంటే థియేటర్లలోనే చూడాలి. కానీ.. థియేటర్లో మిస్సయిన కొన్ని సినిమాల్ని ఓటీటీలో కవర్ చేశా. అలా.. నా లాక్ డౌన్ సమయం గడిచిపోయింది“ అని చెప్పుకొచ్చాడు శిరీష్. ప్రస్తుతం `గో లోకల్ బీ వోకల్` అనే క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాడు శిరీష్.