తెలంగాణ గవర్నర్ తమిళిసై కరోనా కట్టడి విషయంలోకేసీఆర్ సర్కార్ పై మొదటి సారి డైరక్ట్ ఎటాక్ చేశారు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. కరోనా ప్రారంభమైన మొదట్లో ప్రభుత్వం పట్టించుకోలేదని… తాను ఇచ్చిన సలహాలను లైట్ తీసుకుందని.. సీరియస్గా తీసుకుని ఉంటే పరిస్థితి మెరుగ్గా ఉండేదని తమిళిసై అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఆలస్యంగా స్పందించిందని తేల్చారు. మూడు నెలల ముందు నుంచే హెచ్చరిస్తున్నా… ఇప్పుడు ఆ చర్యలు చేపట్టారున్నారు. టెస్టుల విషయంలోతమిళిసైప్రధానంగా అసంతృప్తి వెలి బుచ్చారు.
ఎవరైనా పరీక్ష చేయమని వస్తే వెనక్కి పంపవద్దని తాను చెబుతూ వచ్చానని కానీ ఇప్పటికీ.. ఈ విషయంలో తెలంగాణ ప్రజలు సమస్యను ఎదుర్కొంటున్నారని ఆమె చెబుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్.. కలిసినప్పుడు స్పష్టంగా చెప్పానన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల ఇబ్బందులు చూశాననన్నారు. ప్రభుత్వం చెబుతున్న దానికి క్షేత్ర స్థాయిలో పరిస్థితులను తమిళిసై విశ్లేషించారు. ఏడు వేల మంది డాక్టర్లు అవసరం అయితే 2 వేల 200 పోస్టులు ఖాళీగా ఉన్నాయని .. 20 వేల వైద్య సిబ్బంది అవసరం అయితే 4373 సిబ్బంది మాత్రమే ఉన్నారని లెక్కలతో సహా చెప్పారు.
తమిళిశై గతంలో… కరోనాపై యాక్టివ్ గా స్పందించాలని ప్రయత్నించారు. కానీ ప్రభుత్వ అధికారవర్గాలు స్పందించలేదు. ఓ సారి తాము బిజీగా ఉన్నామని చెప్పి రాజ్ భవన్ కు కూడా వెళ్లలేదు. ఆ తర్వాత వెళ్లినా…గవర్నర్ సందేశాలు పట్టించుకోలేదు. దాంతో ఆమె .. కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాలేకపోయారు. ఆ అసంతృప్తిని ఇప్పుడు జాతీయ మీడియా ముందు వెలిబుచ్చినట్లుగా కనిపిస్తోంది.