అమెరికాలో శరవేగంగా దూసుకుపోతోన్న ప్రముఖ సౌత్ ఇండియన్ రెస్టారెంట్ చైన్ “గోదావరి” ఇప్పుడు మిన్నియాపోలిస్ నగరంలోకి అడుగుపెట్టబోతోంది.
భారతీయ వంటకాలు, గోదావరి రుచులు, ప్రత్యేకమైన వంటకాలు, అత్యుత్తమైన ఆహ్లాదకర వాతావరణం, సమ్మోహనపరిచే విందు భోజనాల వేదికతో మిన్నియాపోలిస్ లోని భోజనప్రియులను అలరించేందుకు గోదావరి సిద్ధమైంది.
ఈ వారాంతంలో వినాయక చవితి సందర్భంగా ఈడెన్ ప్రైరీ లో ప్రారంభించబోతున్న “గోదావరి మిన్నియాపోలిస్” ప్రారంభోత్సవానికి మీ అందరినీ సగర్వంగా “గోదావరి” యాజమాన్యం మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తోంది. (Indian restaurants in Minneapolis).
కరోనా మహమ్మారి ప్రపంచ రూపురేఖలను మార్చివేసిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు వంటి వాటిపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. అమెరికా కూడా అందుకు మిహాయింపు కాదు. అయితే, అమెరికాలోని అనేక ప్రాంతాలు కరోనా నుంచి కోలుకున్నాయి.
గోదావరి రెస్టారెంట్ కూడా కరోనాకు గుడ్ బై చెప్పి…మామూలు జీవితాన్ని రీస్టార్ట్ చేసేందుకు సిద్ధమైంది. అందుకే, కరోనా నుంచి కోలుకొని సాధారణ జీవితం ప్రారంభించిన మిన్నియాపోలిస్ ప్రజల కోసం అమెరికాలోని అత్యుత్తమ భారతీయ రెస్టారెంట్లలో ఒకటైన “గోదావరి” సరికొత్త బ్రాంచ్ ను ప్రారంభించబోతోంది. వినాయక చవితి సందర్భంగా ఆ గణనాధుని ఆశీస్సులతో ఆగస్టు 22, శనివారంనాడు “గోదావరి” తమ నూతన రెస్టారెంట్ తో మిన్నియాపోలిస్ లో అడుగుపెట్టబోతోంది.
కరోనా మహమ్మారి సోకకుండా రెస్టారెంట్లో అన్నిరకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకొని రెస్టారెంట్ నిర్మాణం, నమూనాలో మార్పులుచేర్పులు చేసింది గోదావరి. ఈడెన్ ప్రైరీ మాల్, అనేక కార్పొరేట్ ఆఫీసులు ఉన్న ఈడెన్ ప్రైరీ ప్రాంతంలో ఒక మంచి భారతీయ రెస్టారెంట్ లేని లోటును “గోదావరి మిన్నియాపోలిస్” భర్తీ చేయనుంది.
మా సరికొత్త బ్రాంచ్ లో భారతీయ సంప్రదాయ వంటకాలతోపాటు పలు రకాల డిషెస్, సరికొత్త వంటాకాలను అందించబోతున్నామని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా “గోదావరి”లోని వంటకాలు రుచి చూసిన తర్వాత ఆంధ్రాలోని గోదావరి పల్లె వంటకాల రుచులు తప్పక గుర్తుకు వస్తాయని చెప్పేందుకు సంతోషిస్తున్నాం. (Authentic Indian food in America).
కరోనా మహమ్మారి నేపథ్యంలో భారీ లంచ్ బఫెట్లను సంప్రదాయ థాలీలకు మార్చడం వంటి పలు సవాళ్లను గోదావరి అధిగమించింది. కరోనా తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందుతున్న సమయంలోనూ అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకొని చాలా లొకేషన్లలో “గోదావరి” రెస్టారెంట్ ను మా కస్టమర్లు, ప్రజల కోసం తెరిచే ఉంచాం. కరోనా విపత్తు సమయంలో భారతీయ వంటకాలను మిస్ కాకూడదన్న ఉద్దేశ్యంతో చాలా లొకేషన్లను మూసివేయలేదు.
అయితే, కరోనా మహమ్మారి వల్ల వ్యాపార రంగంలో పెను మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. కరోనా దెబ్బకు మెక్ డొనాల్డ్స్, డంకిన్ డోనట్స్, చీస్ కేక్ ఫ్యాక్టరీ వంటి దిగ్గజ రెస్టారెంట్లు సైతం కొన్ని లొకేషన్లలోని తమ రెస్టారెంట్లను మూసివేసాయి. గోదావరి కూడా అందుకు మినిహాయింపు కాదు.
అందుకే, కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటోన్న ఒక లొకేషన్ లో గోదావరి రెస్టారెంట్ ను తాత్కాలికంగా, మరి కొన్ని లొకేషన్లను పూర్తిగా మూసివేస్తున్నామని తెలియజేసేందుకు చింతిస్తున్నామని తేజ చేకూరి చెప్పారు. అయితే, రాబోయే పదేళ్ల కాలంలో మా కస్టమర్లకు పాత వంటకాలను కొనసాగించడంతోపాటు మరిన్ని కొత్త రుచులు, కొత్త వంటకాలు, కొత్త కాన్సెప్ట్ లు అందించేందుకు గోదావరి సిద్ధమవుతోందని తెలియజేసేందుకు సంతోసిస్తున్నామని చెప్పారు.
ఈ మహమ్మారి వల్ల దొరికిన సమయం…భవిష్యత్ వ్యూహాలు రచించేందుకు ఉపయోగపడిందని అన్నారు. ఇప్పటికే, ప్రపంచవ్యాప్తంగా పలు లొకేషన్లలో ఉన్న గోదావరి రెస్టారెంట్లు విజయవంతంగా నడుపుతున్నామని, భవిష్యత్తులో మరిన్ని బ్రాంచ్ లను ఏర్పాటు చేస్తామని తేజ చేకూరి చెప్పారు. (Best Indian food in Minneapolis).
ఈ వారాంతం గోదావరికి ఎంతో ప్రత్యేకమైనదని, న్యూయార్క్ లోని మ్యాన్ హాటన్ లో ఏర్పాటు చేసిన దక్షిణ భారత దేశపు తొలి గ్యాస్ట్రోబార్ “ఖిలాడీ”ని ప్రారంభించి ఏడాది పూర్తయిందని తెలిపేందుకు సంతోషిస్తున్నామని అన్నారు. అంతేకాదు, భారతీయులు భక్తి శ్రద్ధలతో జరుపుకునే వినాయక చవితి సందర్భంగా మిన్నియాపోలిస్ లో కొత్త బ్రాంచ్ ప్రారంభించడం ఎంతో సంతోషం కలిగిస్తోందని చెప్పారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత తమ తొలి బ్రాంచ్ ప్రారంభోత్సవం వినాయక చవితి పండుగనాడు జరగడం ఆనందాన్నిస్తోందన్నారు తేజ చేకూరి అన్నారు.
గోదావరి తమ కొత్త బ్రాంచ్ ను ఈడెన్ ప్రైరీ సిటీలో ప్రారంభించనుందనే వార్తను మేం విన్నపుడు మాకెంతో సంతోషం కలిగిందని మిన్నియాపోలిస్ లో నివసిస్తోన్న భోజన ప్రియురాలు రమా ఓరుగంటి అన్నారు. మిన్నియాపోలిస్ లో ఇప్పటివరకు మంచి భారతీయ వంటకాలు అందించే రెస్టారెంట్ లేదని, ఆ లోటు ఈడెన్ ప్రైరీ లో ప్రారంభం కాబోతోన్న “గోదావరి మిన్నియాపోలిస్” తో (Godavari Minneapolis) తీరిపోయిందని ఆమె చెప్పారు.
గోదావరి అందించబతోన్న “బాహుబలి థాలి”, “జ్యోతిలక్ష్మి జున్ను”ను రుచి చూసేందుకు మేమంతా ఉవ్విళ్లూరుతున్నామని అన్నారు. “గోదావరి” రుచుల కోసం ఇక్కడ చాలామంది భారతీయులు ఆతృతగా ఎదురు చూస్తున్నారని, ఇప్పటివరకు కేవలం విని సంతోషించిన గోదావరి చుచులను ఇకపై స్వయంగా తిని ఆనందించబోతున్నామని రమా అభిప్రాయపడ్డారు.
ఆగస్టు 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు `గోదావరి మిన్నియాపోలిస్` ప్రారంభం కానుంది. మా రెస్టారెంట్ ప్రారంభోత్సవం, వినాయక చవితి పండుగ…ఇలా ఒకేసారి వచ్చిన రెండు పండుగల సందర్భంగా మేం అందిస్తోన్న”వినాయక చవితి” స్పెషల్ థాలీని ఆస్వాదించేందుకు రావాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం.
గోదావరి మిన్నియాపొలిస్
566 ప్రైరీ సెంటర్, ఈడెన్ ప్రైరీ
మిన్నియాపొలిస్, 554463
మరింత సమాచారం కోసం దయచేసి సంప్రదించండి.
ఫోన్: 952-941-8242
ఈ మెయిల్: Minneapolis@godavarius.com
ఈ వారాంతంలో “గోదావరి మిన్నియాపోలిస్”కు రండి…మా ప్రత్యేక వంటకాలు, రుచులను ఆస్వాదించండి…రండి అందరం కలిసి పండుగ చేసుకుందాం.
సదామీసేవలో…..
Press release by: Indian Clicks, LLC