రాక్షసన్ రీమేక్‌గా తెలుగులో వచ్చిన `రాక్షసుడు` మంచి విజయాన్ని అందుకుంది. దర్శకుడిగా రమేష్ వర్మకు మంచి కమ్ బ్యాక్ మూవీ అయ్యింది. ఇప్పుడు రవితేజతో ఓ సినిమా ఓకే చేసుకున్నాడు రమేష్ వర్మ. ఇప్పుడు బాలీవుడ్ లోనూ అడుగుపెట్టబోతున్నాడు. `రాక్షసుడు`ని బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి అంతా సిద్ధమైంది. తెలుగులో రూపొందించిన కోనేరు సత్యనారాయణ.. ఓ ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థతో కలిసి ఈసినిమాని రీమేక్ చేయనున్నారు. ఈ చిత్రానికి రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తారు. ఓ స్టార్ హీరో ఈ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తారని సమాచారం. వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈరోజే విడుదల చేయనుంది చిత్రబృందం.