మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడా? జీవిత భాగస్వామిని వెదుక్కుని ఈ బ్యాచిలర్ జీవితానికి స్వస్తి పలకబోతున్నాడా? తేజూ ట్విట్టర్లో విడుదల చేసిన ఓ వీడియో చూస్తే.. అదే అనిపిస్తోంది. ఈరోజు తేజూ ట్విట్టర్ లో ఓ ఆసక్తికరమైన వీడియో అప్ లోడ్ చేశాడు.
ఇందులో బ్యాచిలర్ హీరోలందరూ కలిసి ఉన్న ‘సింగిల్ ఆర్మీ’ అనే వాట్సాప్ గ్రూప్ నుంచి నిఖిల్, నితిన్, రానా.. ఇలా ఒక్కొక్కరు లెఫ్ట్ అయ్యారు. చివర్లో “ప్రభాస్ అన్నా.. సారీ, ఇప్పుడు నా వంతు వచ్చిందంషటూ సాయి ధరమ్ కూడా లెఫ్ట్ అయ్యాడు. ‘ఒక్కోసారి ఎన్నెన్నో అనుకుంటాం. టైమ్ వచ్చినప్పుడు మరి… ‘ అంటూ ఓ కామెంట్ పోస్ట్ చేశాడు. పూర్తి వివరాలు సోమవారం ఉదయం 10 గంటలకు చెప్తాడట. దీంతో బ్యాచిలర్ గ్రూప్ నుంచి బయటకు వచ్చి… పెళ్లి చేసుకోబోతున్నాడేమో అని మెగా ఫ్యాన్సంతా అనుకుంటున్నారు. కాకపోతే.. ఇదంతా తన కొత్త సినిమా `సోలో బ్రతుకే సో బెటర్` సినిమా కోసమేమో.. అని కూడా అనిపిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన కొత్త పాటని సోమవారం విడుదల చేస్తార్ట. ఆ పాట కోసమే.. ఇలా హింట్ ఇచ్చి, తన అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించాడా? అనిపిస్తోంది. కరోనా సీజన్ కాస్త.. టాలీవుడ్ కి పెళ్లిళ్ల సీజన్ గా మారింది. తేజూ.. పెళ్లి ప్రకటన చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇదంతా.. పబ్లిసిటీ కోసమే అన్నా షాక్ అవ్వాల్సిన పనిలేదు.
ఒక్కో సారి మనం ఎన్నో అనుకుంటాం కానీ ఆ టైం వచ్చినప్పుడు మరి….
More details tomorrow at 10AM pic.twitter.com/5PJZIPuVJu
— Sai Dharam Tej (@IamSaiDharamTej) August 23, 2020