శనివారం తన 65వ పుట్టిన రోజు జరుపుకున్నారు చిరంజీవి. ఈ సందర్భంగా ట్విట్టర్లు హోరెత్తాయి. మెగాస్టార్‌కి సినీ, రాజకీయ సెలబ్రెటీలు పుట్టిన రోజు శుభాకాంక్షలు తమకు తోచిన రీతిలో తెలిపాయి. అయితే చిరు స్నేహితుడు, ప్రముఖ నటుడు మోహన్ బాబు చిరంజీవికి ఓ అరుదైన కానుక పంపారు. చెక్కతో చేసిన ఓ బైక్‌ని చిరుకి బహుమతిగా ఇచ్చాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో తన అభిమానులతో పంచుకున్నారు చిరు. ”నా చిరకాల మిత్రుడు, తొలిసారి నా పుట్టినరోజునాడు, ఓ కళాకృతిని కానుకగా పంపాడు. ఆ కానుకలో అతని రాజసం, వ్యక్తిత్వం ఉట్టిపడుతున్నాయి” అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి. ఆ కళాకృతి చూడ్డానికిముచ్చటగా ఉంది. అదో హార్లీ డేవిడ్సన్ బండికి ప్రతిరూపం. నెంబర్ ప్లేట్ మీద మెగా స్టార్ అని చెక్కతో చెక్కివుంది. ఆ బండి మీద పోజు ఇస్తూ చిరు ఓ ఫొటో దిగి.. ట్విట్టర్ లో ట్యాగ్ చేశారు.