కలెక్షన్ కింగ్ మోహన్‌బాబుకు ఇటీవలి కాలంలో సినిమాల కలెక్షన్లు లేవు. ఆయనకు విద్యా సంస్థల నుంచి కూడా కలెక్షన్లు లేవట. కాలేజీల స్టాఫ్‌కు జీతాలివ్వడానికి ఇతర అవసరాల కోసం…ఇల్లు, ఇతర ఆస్తులు తాకట్టు పెట్టి రూ.పాతిక కోట్లు అప్పు చేశానని.. మీడియా ముందు చెప్పుకున్నారు. ఓ టీవీ చానల్‌కు ఇంటర్యూ ఇచ్చి..కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందన్నట్లుగా నర్మగర్భంగా వ్యాఖ్యలు చేసి… వైరల్ అవుతున్నారు. చంద్రబాబు సీఎంగా ఉండగా.. ఎన్నికలకు ముందు.. తిరుపతిలోని విద్యానికేతన్ కాలేజీ నుంచి విద్యార్థులతో సహా ర్యాలీ చేసి..రోడ్డుపై పడుకున్న ఆయన ఆందోళన అప్పట్లో హైలెట్ అయింది.
ఆ తర్వాత వైసీపీలో చేరిపోయారు. వైసీపీతో కలిసి కావాలని అలా చేశారని టీడీపీ నేతలు మండిపడ్డారు. ఆయన కాలేజీకి ఇచ్చిన ఫీజు రీఎంబర్స్ నిధులను ఇచ్చామని జాబితా కూడా విడుదల చేశారు. ఇప్పుడు..మరి చెప్పిన బకాయిలన్నీ జగన్ ఇచ్చేశారా అంటే… ఇవ్వలేదని చెబుతున్నారు. అదేంటి.. జగన్ వచ్చి పదిహేను నెలలు అవుతున్నా…ఫీజురీఎంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వలేదా అంటే ఇవ్వలేదనే చెబుతున్నారు. ఆ సమయంలోనే… జీతాలకు ఇల్లు, ఆస్తులు తాకట్టు పెట్టుకున్నానని చెప్పారు. జగన్ ఇస్తామని చెబుతున్నారని…తాను మాట్లాడలేదు కానీ..తన కుమారుడు విద్యాసంస్థల సీఈవో మంచు విష్ణు మాట్లాడారని అంటున్నారు.
నిజానికి జగన్మోహన్ రెడ్డి కొద్ది రోజుల కిందట.. ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలు మొత్తం విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. గత ప్రభుత్వ బకాయిలు అన్నీ చెల్లించేస్తున్నామన్నారు. ఘనంగా ప్రకటన కూడా ఇచ్చారు. అనూహ్యంగా…. తమ కాలేజీకి ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేదని అంటున్నారు. అంటే.. అటు ప్రభుత్వం అయినా లేకపోతే.. ఇటు మోహన్ బాబు అయినా అబద్దం చెబుతూ ఉండాలి. సరే మరి ఫీజు లు ఇవ్వలేదంటున్నారు కాబట్టి..గతంలోలా..కుమారుల్ని.. విద్యార్థుల్ని తీసుకుని రోడ్డెక్కుతారా అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వస్తున్నాయి.