గన్నవరంకు వైసీపీకి తానే ఇన్చార్జ్, తానే ఎమ్మెల్యేని అని ప్రకటించేసుకున్న వల్లభనేని వంశీకి .., పరిస్థితులు అంత తేలిగ్గా లేవు. ఆయనపై వైసీపీ నేత దుట్టా రామచంద్రరావు ఒంటికాలిపై లేస్తున్నారు. వంశీ ప్రకటన ఆయనకు ఆగ్రహం తెప్పించడంతో దుట్టా రామచంద్రరావు.. వంశీ జగన్ కాళ్లు పట్టుకుని వైసీపీలోకి వచ్చారని.. తాను పార్టీ పెట్టినప్పటి నుండి అందులోనే ఉన్నానని విమర్శలు ప్రారంభించారు. కొద్ది రోజుల క్రితం.. కలిసి పని చేద్దామని వంశీ ఆయన ఇంటికి వెళ్లి అడిగారు. ఆయన నిర్మోహమాటంగా అలాంటి ప్రసక్తే లేదని చెప్పి మొహం మీదే తలుపులేసేశారు. ప్రభుత్వం తరపున ఎవరైనా మంత్రులు గన్నవరం వస్తే.. దుట్టా ఇంటికి వెళ్లి .. వెళ్తున్నారు.
అయితే వంశీ మాత్రం..తానే వైసీపీకి ఇన్చార్జ్నని.. ఎమ్మెల్యేలనని స్వయంగా చెప్పుకుటున్నారు. వైసీపీలో అలాంటి ప్రకటనలు చెల్లవు. ఆయన వైసీపీలో చేరితే పదవి పోతుందని.. ఇంకా బయట ఉన్నట్లుగా రాజకీయం చేస్తున్నారు. కానీ అలా ఉండటం వల్ల.. ఓ వైపు దుట్టా రామచంద్రరావు.. మరో వైపు యార్లగడ్డ వెంకట్రావు తమ తమ వర్గాలను బలోపేతం చేసుకుంటున్నారు. వాస్తవానికి వారు తమ అనుచరులకు పనులు కూడా చేసి పెడుతున్నారు. వంశీతో వచ్చిన వాళ్లు టీడీపీ కార్యకర్తలే కావడంతో. .. వారికి పనులు జరుగుతూంటే… వైసీపీ కార్యకర్తలకు ఆగ్రహం వస్తోంది. ఇది వంశీకి మరింత ఇబ్బందికరంగా మారింది.
హైకమాండ్ పెద్దల అనుమతి వచ్చిందేమో కానీ దుట్టా రామచందర్‌రావు.. వంశీపై వ్యక్తిగతంగా విమర్శలు ప్రారంభించారు. చంద్రబాబు, లోకేష్‌పై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే.. వంశీపై… ఇప్పుడు దుట్టా ఆ తరహా లాంగ్వేజ్‌ను ప్రయోగిస్తున్నారు. మరి వంశీ.. ఇప్పుడు తన లాంగ్వేజ్ పవర్‌ను.. దుట్టాపై చూపిస్తారా.. లేక… ఆయనను ఏమీ అనలేని పరిస్థితుల్లో ఉన్నానని సైలెంట్‌గా ఉంటారో వేచి చూడాలి. ఒక వేళ ఆయన దుట్టాపై విమర్శలు చేస్తే.. వైసీపీ హైకమాండ్ ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని కూడా నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. మొత్తానికి వంశీ పరిస్థితి.. అటూ ఇటూ కాకుండా అయిపోతోందన్న చర్చ జరుగుతోంది.