ఆయనకు పనేమీ ఉండదు. పేరుకు సలహాదారు. సలహాలివ్వడానికి ఆయన సిద్ధమే. కానీ తీసుకోవడానికి మాత్రం … ఎవరూ రెడీగా లేరు. కనీసం చాంబర్ కూడా లేదు. అడ్డం అవుతారని అనుకున్నారేమో… హైదరాబాద్‌లోనో… ఢిల్లీలోనో ఉండమని.. ఓ ఆఫర్ కూడా ఇచ్చేశారు. అప్పుడప్పుడు ఆయన ప్రెస్నోట్లు జారీ చేస్తూంటారు. అదీ కూడా ప్రభుత్వానికి ఇబ్బంది వచ్చినప్పుడు. నిన్న ఇలా.. కమ్యూనిస్టు పార్టీ నేతల్ని వెటకారం చేస్తూ.. ఓ ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు.
విమర్శలకు ప్రతి విమర్శలు చేయడమే సలహాదారుల పనా..?
ఆంధ్రప్రదేశ్ ప్రజల పన్నుల ధనాన్ని సలహాదారుల రూపంలో ఎలా … పీల్చి పిప్పి చేస్తున్నారో దానికి దేవులపల్లి అమరే ఉదాహరణ. ఆయన ప్రభుత్వానికి… ప్రజలకు చేస్తున్న సేవ లేశ మాత్రం కూడా లేదు. ఏం చేస్తున్నారని ఎవరైనా అడిగితే… ఎదురుదాడి మాత్రం చేస్తారు. సలహాదారు రామచంద్రరావు రాజీనామా తర్వాత… అందరు సలహాదారులపై సీపీఐ నేత రామకృష్ణ విమర్శలు చేస్తే.. ముందుగా… తెరపైకి వచ్చింది దేవులపల్లి అమరే. రాజకీయ పరమైన విమర్శలకు నేరుగా ఆయన లేఖ విడుదల చేసి.. కమ్యూనిస్టు పార్టీ నేతను వెటకారం చేశారు. కమ్యూనిస్టు పార్టీకి సీట్లు, ఓట్లు రాకపోవచ్చేమో కానీ.. వారేమీ ప్రజాధనం మింగడం లేదు. తమ జీవితాలను ప్రజల కోసం వెచ్చిస్తున్నారు. అలాంటి నేతను… ప్రజాధనం.. నెలకు రూ. నాలుగు లక్షలకుపైగా మింగుతున్న దేవులపల్లి అమర్ వెటకారం చేస్తున్నారు.
అధికారం మెప్పు కోసం అర్రులు చాస్తోంది కమ్యూనిస్టులా..? దేవులపల్లి అమరా..?
సలహాదారులు ప్రభుత్వ లకు ఇచ్చే సలహాలు ప్రకటనల ద్వారానో , వీధి ప్రదర్శనల ద్వారానో ఉండవట…బహుశా దేవులపల్లి అమర్ చెవిలో చెప్పి వస్తున్నారేమో…?. అధికారం లో భాగస్వామ్యం కోసమో, చట్టసభల్లో సొంత శక్తి తో వెళ్ళలేక అధికార పక్షాల మెప్పుకోసం,ఇతరేతర ప్రయోజనం కోసం చేసే ఇచ్చేవి సలహాలు కావని అమర్ చెబుతున్నారు. కానీ అధికారం కోసం … తాను తెలంగాణ ఉద్యమంలో తిట్టిన ఆంధ్ర ప్రజల పన్నుల సొమ్మునే… కదా ఇప్పుడు అమర్ తింటున్నది. అధికారపక్షం మెప్పు కోసమే కదా.. విపక్ష పార్టీల నేతలపై ఇలాంటి లేఖలు రాసేది. అమర్… జర్నలిజం అంటే.. ఏమిటనుకున్నారో కానీ.. ప్రజాధనం దుర్వినియోగంపై పోరాడటమే విపక్షాల పని. అప్పుడే ప్రజలు ఆదరిస్తారు. సీపీఐ నేత రామకృష్ణ తన పని తాను చేసుకుంటున్నారు. కానీ ప్రజా ధనం రూ. లక్షలు తీసుకుంటున్న అమర్ తన పని తాను చేస్తున్నారా..? అనేది ఇక్కడ ప్రశ్న.
రాష్ట్రం విడిపోయినా ఆంధ్రులకు ఈ వెటకారాలేంటి..?
ఆంధ్రులకు ఏం పరిస్థితి వచ్చింది..? తెలంగాణ ఉద్యమంలో ఆయన ఆంధ్రుల్ని నానా విధాలుగా కించ పరిచారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఆయన వదిలి పెట్టడం లేదు. ప్రజల కోసం పని చేస్తున్న కమ్యూనిస్టు పార్టీలను.. అదే అహంకారంతో… ఆంధ్రులనే చులకన భావంతోనే వెటకారం చేస్తున్నారు. ఏపీ ప్రజల సొమ్మును తింటూ.. ఏపీ రాజకీయ పార్టీల్నే కించ పరుస్తున్నారు దేవులపల్లి అమర్. ఒక్క అమరే కాదు.. ఈ లెక్కన… తెలంగాణ ఉద్యమకారులు.. ఆంధ్రప్రభుత్వంలో చాలా మంది ఉన్నారు. వారందరి టార్గెట్.. ఆంధ్రనే..!
ఇలా విమర్శలు చేసినందుకు నజరానాలా..?
జీతభత్యాల రూపంలో గత పదిహేను నెలల కాలంలో దేవులపల్లి అమర్ ప్రభుత్వం వద్ద నుంచి అరకోటికిపైగానే వసూలు చేశారు. కానీ ఇప్పుడు ఆయనకు ప్రభుత్వం రూ. పాతిక వేలు లోను ఇచ్చింది. ఊరకనే ఇవ్వదు కదా.. ఆయన దరఖాస్తు చేసుకుని ఉంటారు. సలహాలివ్వడానికి తనకు కంప్యూటర్ లేదని… దాని కొనుగోలుకు రుణం ఇవ్వాలని ఆయన దరఖాస్తు పెట్టుకున్న మీదట ..” కేర్‌ఫుల్ ఎగ్జామినేషన్” చేసిన అధికారులు.. ఆయనకు రూ. పాతికవేలు లోన్ మంజూరు చేశారు. దాన్ని నెలకు రూ. ఐదు వేల చొప్పున.. ఐదు నెలల పాటు వాయిదాల పద్దతిలో కట్టేలా కూడా వెసులుబాటు కల్పించారు. బహుశా.. ఇది కమ్యూనిస్టుల్ని వెటకారం చేసినందుకు వచ్చిన ప్రతిఫలం కావొచ్చు.