కథానాయిక తమన్నా తల్లిదండ్రులకు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని తమన్నా తన ట్విటర్ ద్వారా ధృవీకరించింది. ‘‘మా అమ్మా, నాన్న గత కొద్ది రోజులుగా కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఇంట్లో ఉన్న వారందరమూ టెస్టులు చేయించుకున్నాం. దురదృష్టవశాత్తు మా తల్లిదండ్రులకు పాజిటివ్ వచ్చింది కానీ, నాతో పాటు మిగిలిన కుటుంబ సభ్యులందరికి నెగిటివ్ వచ్చింది. అధికారులు ఎప్పటి కప్పుడు అమ్మానాన్నల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తూనే ఉన్నారు. తగిన ముందు జాగ్రత్త చర్యల్ని పాటిస్తున్నాము. భగవంతుడి దయ వల్ల వారు ప్రస్తుతం బాగానే ఉన్నారు’’ అని తమన్నా ట్విట్టర్ లో రాసుకొచ్చింది. ముందు జాగ్రత్త చర్యగా తమన్నా కూడా కొన్నాళ్ల పాటు హోం క్వారెంటైన్లో ఉండబోతోంది. ప్రస్తుతం `సిటీమార్`లో నటిస్తోంది తమన్నా. లాక్ డౌన్, కరోనా వల్ల.. అన్ని సినిమాలతో పాటు ఈ సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తమన్నా కూడా షూటింగులకుల రావడం కష్టమే.