పరిశ్రమల్ని ఆకర్షించడంలో అందరి కన్నా ముందు ఉన్న తెలంగాణ .. ఆటోమేటిక్‌గా ఎగుమతుల సన్నద్ధతలోనూ అగ్రభాగాన నిలిచింది. ఈ విషయంలో దేశంలో తెలంగాణ ర్యాంక్ ఆరుగా నీతిఆయోగ్ లెక్క తేల్చింది. ఈ ర్యాంక్‌ను… పారిశ్రామిక విధానం.. వ్యాపార అనుకూల వ్యవస్థ, ఎగుమతుల అనుకూల వ్యవస్థ, ఎగుమతుల పనితీరు.. ప్రామాణికంగా తీసుకుని నిర్ణయిస్తున్నారు. సహజంగానే గుజరాత్‌కు ఈ అంశంలో మొదటి ర్యాంక్ లభించింది. గుజరాత్లో ఉన్న పారిశ్రామిక సంస్థల్లో ఎక్కువ ఉత్పత్తి విదేశాలకు.. ఎగుమతి అవుతూ ఉంటుంది. తర్వాత ర్యాంక్.. దేశానికి.. పారిశ్రామిక కేంద్రంగా ఉన్న మహారాష్ట్రకు దక్కింది. ఆ తర్వాత స్థానంలో తమిళనాడు నిలిచింది. తెలంగాణ ఆరో స్థానం దక్కింది.
తెలంగాణలో సేవల రంగంలో కొంత కాలం పాటు విపరీతమైన వృద్ధి నమోదైంది. సాఫ్ట్ వేర్ కంపెనీలు.. అనుబంధ సంస్థలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాయి. అయితే.. ప్రస్తుతం… ఐటీతో పాటు.. ఉత్పాదక రంగంపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. మంత్రి కేటీఆర్ ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని… ఆన్ లైన్ ద్వారా.. పారిశ్రామిక వేత్తలతో సంప్రదింపులు జరుపుతున్నారు. కరోనా కారణంగా రాబోతున్న కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే.. ఎనిమిది బడా సంస్థలు..తమ ప్లాంట్లను తెలంగాణ పెట్టడానికి సిద్ధమయ్యాయి. తెలంగాణ సర్కార్ ప్రయత్నాలు ఫలిస్తే.. వచ్చే ఏడాది కల్లా.. ఎగుమతుల సన్నద్ధతలో తెలంగాణ మరింత ముందుకెళ్తుంది.
పొరుగు రాష్ట్రం ఏపీ పరిస్థితి మాత్రం.. ఎగుమతుల సన్నద్ధతలో.. అట్టడుగున ఉన్నది. నీతి ఆయోగ్ ప్రకటించిన వివరాల్లో ఏపీకి దక్కిన స్థానం 20. ఎగుమతులు చేయగలిగే ఏ పరిశ్రమలూ ఉండని ఈశాన్య రాష్ట్రాలకన్నా ఏపీ మెరుగ్గా ఉంది. విభజన తర్వాత ఏపీలో పారిశ్రామికీకరణ కోసం గత ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేసింది. కియా లాంటి పరిశ్రమలతో పాటు… హెచ్‌సీఎల్ లాంటి సాఫ్ట్ వేర్ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. అయితే.. ఆ మూడ్ కొనసాగించడంలో విఫలం కావడంతో… పరిస్థితి దిగజారిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో మాత్రం అక్కడి రాజకీయం ఎలా ఉన్నా… అభివృద్ధి.. పరిశ్రమల విషయంలో మాత్రం.. పాలకులు రాజీపడటం లేదు.