ఓ మంత్రికి సంబంధించిన కారులో కోట్లకు కోట్లు పట్టుబడతారు.. కానీ ఆయనకేం సంబంధం ఉండదు. ఓ ఎమ్మెల్యే గోడౌన్‌లో గుట్కా తయారీ ఫ్యాక్టరీ ఉంటుంది. కానీ ఆయనకేం సంబంధం ఉండదు.. ఈ తరహాలోనే మరో మంత్రి స్వగ్రామంలో పేకాట డెన్ బయటపడింది. కానీ ఆయనకేం సంబంధం ఉండదు. ఆంధ్రప్రదేశ్‌లో అంతే జరుగుతుంది. కర్నూలు జిల్లా ఆలూరు నుంచి ఎమ్మెల్యేగా లెచిన గుమ్మనూరు జయరాం మంత్రి అయ్యారు. ఆయన ఇంటి పేరు.. ఆయన స్వగ్రామం పేరు ఒకటే. అదే గుమ్మనూరు. ఆయన బంధువర్గం మొత్తం అక్కడే ఉంటుంది. అలాంటి ఉరు… ఇటీవలి కాలంలో బాగా ప్రసిద్ధి చెందింది.
కర్నూలు జిల్లా గుమ్మనూరు అడ్రస్ ఎక్కడ అని కనుక్కుని.. కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి ఖరీదైన కార్లలో వస్తున్నారు. ఎందుకంటే.. మంత్రిగారు అంత కుగ్రామం నుంచి ఎలా ఎదిగారో తెలుసుకోవడానికి కాదు. అక్కడ ఏర్పాటు చేసిన పేకాట డెన్ లో పేకాట ఆడుకోవడానికి. స్వయంగా మంత్రిగారి ఇలాఖా…. ఆయనకు తెలియకుండా పోలీసు కూడా అడుగు పెట్టే చాన్స్ లేదు. అందుకే…భరోసాగా ఉంటుందని అందరూ అక్కడకు వచ్చి పేకాడేసుకుంటున్నారు. రోజుకు కోట్లలోనే లావాదేవీలు జరుగుతున్నాయి. కమిషన్ రూపంలో కనీసం రూ. పది లక్షలు రోజుకు మంత్రి క్యాంప్‌కు అందుతాయని చెప్పుకుంటూ ఉంటారు.
అయితే.. గుమ్మనూరు కు ఈ ఖ్యాతి రావడం ఇష్టం లేకనో.. లేక అంత ఆదాయం వస్తుందని కుళ్లుకున్నారో కానీ.., ఎవరో.. పోలీసులకు సమాచారం అందించారు. అంత పెద్ద పేకాట డెన్ నడుస్తూంటే.. ఇప్పటి వరకూ పోలీసులకు తెలియదా అని అనుకోకుండా ఉండలేం. తెలుసు… కానీ.. ఎటాక్ చేసే ధైర్యం లేదు. ఎవరో మంత్రిగారి బండారం బయటపెట్టాలని… వైసీపీలోనే పెద్ద తలకాయ అనుకున్నారు కాబట్టి.. వెంటనే పోలీసులు రెయిడ్ చేశారు. బాగోతం అంతా బయటపెట్టారు. మంత్రి సోదరుడే.. పేకాట డెన్ నిర్వాహకుడని తేలింది. అయితే.. కాసేపటికే.. మంత్రి నుంచి ప్రకటన వచ్చింది. తనకు..తన కుటుంబసభ్యులకు ఏం సంబంధం లేదని..! పోలీసులు కూడా అదే రాసుకుంటారు..! ఏపీలో జరిగేది అదే కదా..!