మీడియా అంటే అదో విచిత్రమైన ప్రపంచం. అలవాటు పడిన వారు.. బతకడం నేర్చుకుంటారు. లేని వారు బతకలేక జర్నలిస్టులా బతికేస్తూంటారు. ప్రత్యక్షంగా రాజకీయపార్టీలతో సంబంధం ఉన్న మీడియాలో అయితే..ఫీల్డ్ ప్రతినిధులుగా అంటే రిపోర్టర్లుగా ఉండటం సామాన్యమైన విషయం కాదు. ఆ పార్టీ ముఖ్యులు.. చానల్‌ను చూసే పెద్దలతో చాలా ర్యాపో మెయిన్‌టెయిన్ చేయాల్సి ఉంటుంది. అంత ప్రావీణ్యం ఉన్న వాళ్లు ఫీల్డ్‌లో చూపే ప్రావీణ్యం మామూలుగా ఉండదు. ఇప్పుడు సాక్షి టీవీలో ఇలాంటి న్యూసెన్స్ పెరిగిపోవడంతో… యాజమాన్యం ఒక్క సారిగా ప్రక్షాళన ప్రారంభించింది. తమ పార్టీ ప్రతినిధులపై అనేకానేక ఆరోపణలు వస్తూండటంతో.. అందర్నీ ఒక్క సారిగా అటూ ఇటూ బదిలీ చేసి పడేసింది.
సాక్షి టీవీకి సంబంధించి ప్రధానమైన జిల్లాల రిపోర్టర్లు అందగ్రనీ.. సుదీర్ఘ కాలంగా ఒక్కచోటే పని చేస్తున్నారన్న కారణంగా బదిలీ చేసి పడేసింది. సాకులు చెప్పకుండా… వచ్చే నెల ఒకటో తేదీ కల్లా వెళ్లి.. అప్పగించిన జిల్లాల్లో రిపోర్ట్ చేయాలని స్పష్టం చేసింది. నిజానికి ఇప్పుడున్న సాక్షి టీవీ రిపోర్టర్లందరూ.. ఆయా జిల్లాల్లో పాతుకుపోయారు. ఒక్క రిపోర్టింగ్తోనే కాదు.. చాలా వ్వయహారాల్లో వారు ఉంటారు. ఒక్క సారిగా అన్నీ వదిలేసి పోవడం అంటే వారికి కష్టమే. అందుకే తమకు ఉన్న పలుకుబడితో… యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
కానీ.. సాక్షి టీవీ యాజమాన్యం మాత్రం.. ఈ విషయంలో సీరియస్‌గా ఉండాలని అనుకుంటోందని చెబుతున్నారు. అధికార పార్టీకి చెందిన అధికారిక టీవీ చానల్లో రిపోర్టర్ అంటే.. సహజంగానే అడ్వాంటేజ్ ఉంటుంది..దాన్ని పోగొట్టుకోవడం చాలా మందికి ఇష్టం ఉండదు. అందుకే చాలా మంది రిపోర్టర్లకు యాజమాన్యం నిర్ణయం కష్టంగా మారింది.