వెబ్ సిరీస్‌ల హవా ఎక్కువ అవుతోంది. అగ్ర కథానాయకులు, పెద్ద నిర్మాణ సంస్థలు అటు వైపు అడుగులు వేస్తున్నారు. తాజాగా కీర్తి సురేష్ కూడా.. వెబ్ సిరీస్ ల వైపు చూస్తున్నట్టు సమాచారం. అయితే… నటించడానికి కాదు, నిర్మించడానికి. కీర్తి త్వరలోనే ఓ వెబ్ సిరీస్ కు నిర్మాతగా వ్యవహరించబోతోందని సమాచారం. దీని ద్వారా ఓ కొత్త దర్శకుడ్ని పరిచయం చేయబోతోందని తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో కీర్తి నటించదట. నిజానికి… ఈ కథ తన కోసమే వచ్చినా, ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్ లో వెబ్ సిరీస్ కి సమయం కేటాయించలేకపోతోంది కీర్తి. కథ నచ్చింది కాబట్టి, నిర్మాణ బాధ్యతల్ని స్వీకరించినట్టు సమాచారం. కీర్తి నటించిన `పెంగ్విన్` ఓటీటీలో విడుదలైంది. ఇప్పుడు `గుడ్ లక్ సఖీ` కూడా అదే బాట పడుతోంది. ఇప్పుడు ఓటీటీ కోసం వెబ్ సిరీస్‌లూ మొదలెట్టేసిందన్నమాట.