హిందూపురం తన గుండెల్లో ఉంటుందని నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. కరోనా ఉద్ధృతంగా ఉన్నప్పటికీ.. ఆయన హిందూపురంలో వరుసగా పర్యటిస్తున్నారు. ఇటీవల ఆస్పత్రికి 55 లక్షల రూపాయల సొంత నిధులతో వైద్య పరికరాలు ప్రకటించారు. వాటిని అందచేసే కార్యక్రమానికి ఆస్పత్రి వచ్చారు. ఈ సందర్భంగా.. హిందూపురంను జిల్లాను చేయాలన్న డిమాండ్‌పై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. హిందూపురం విషయంలో ఎంత దూరమైన వెళతానని.. దానిని జిల్లాగా ప్రకటించాలని..డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌తో అవసరమైతే సీఎం జగన్‌ను కూడా కలిసి విజ్ఞప్తి చేస్తానని కూడా ప్రకటించారు.
ప్రస్తుత రాజకీయాలపైనా తనదైన శైలిలో స్పందించారు. ప్రస్తుతం అభివృద్ధి లేదని.. కక్ష సాధింపులు చర్యలే ఎక్కువ ఉన్నాయన్నారు. ఆదాయాన్ని తెచ్చి పెట్టే భారీ రాజధాని లేకపోయినప్పటికీ.. టీడీపీ హయాంలో… తెలంగాణ కన్నా ఎక్కువ ఆదాయం ఏపీకి వచ్చిందన్నారు. క్లిష్టమైన సమయంలో అందరూ కలిసి పని చేస్తే అభివృద్ధి సాధ్యమని గుర్తు చేశారు. ప్రస్తుతం.. కరోనా ఇతర కష్టాల కారణంగా… ప్రస్తుతం రాష్ట్రం కోసం.. పార్టీలకు అతీతంగా పని చేయాల్సి ఉందని బాలకృష్ణ అంటున్నారు.
బాలకృష్ణ.. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా… నియోజకవర్గ ఎమ్మెల్యేగా మాత్రమే వ్యవహరిస్తున్నారు. మిగతా సమయాన్ని ఆయన సిన్మాలకు కేటాయిస్తున్నారు. పూర్తి స్థాయిలో హిందూపురంపైనే దృష్టి కేంద్రకరిస్తున్నారు. టీడీపీ హయాంలోనూ ఆయన హిందూ పురం వరకే దృష్టి పెట్టారు. అక్కడ వీలైనన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ప్రతిపక్షంలోనూ ఆయన.. అదే పాత్రకు పరిమితమవుతున్నారు. అంత కన్నా ఎక్కువ రాజకీయం చేయాలనుకోవడం లేదు.