హైదరాబాద్లో కొద్ది రోజులుగా మీడియాలో హైలెట్ అవుతున్న 139 మందిపై అత్యాచారం కేసులో బాధితురాలు ప్లేట్ ఫిరాయించింది. తాను తప్పుడు ఫిర్యాదు చేశానని అంగీకరించింది. అయితే.. ఈ విషయంలో డాలర్ భాయ్ అనే వ్యక్తి తనను కొట్టి.. హింసించి.. సైకోలా వ్యవహరించి.. తనతో కేసు పెట్టించాలని… కన్నీరు పెట్టుకుంది. ఎమ్మార్పీఎస్తో పాటు మరికొంత మంది దళిత నేతలతో కలిసి.. ఈ “రేప్ బాధితురాలు” ప్రెస్మీట్లో మాట్లాడింది. ఈ సందర్భంలో.. తాను చెప్పినవన్నీ.. అబద్దాలేనని అంగీకరించింది.
వారం రోజుల కిందట… పంజాగుట్ట పోలీస్స్టేషన్లో ఓ యువతి తనపై ఏడెనిమిదేళ్లుగా 139 మంది అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత పలు మీడియా సంస్థలతో మాట్లాడి.. తన ఆరోపణలు నిజమేనని నమ్మబలికింది. చివరికి ఒక్కో నిజం వెలుగులోకి వచ్చింది. డాలర్ భాయ్ అనే వ్యక్తి.. ప్రముఖుల్ని బ్లాక్మెయిలింగ్ చేసేందుకు ఈ యువతిని పావుగా వాడుకున్నాడని తేలింది. తనతో పరిచయం లేని లేనివారిపై కూడా డాలర్ భాయ్ కేసులు పెట్టించారని యువతి తెలిపింది.
మీడియాతో తాను ఏం చెప్పారో రోజూ రాత్రి పూట చెప్పేవాడని.. ఫొటోలు, వీడియోలు తీసి నన్ను బెదిరించారని చెప్పుకొచ్చింది. 139మంది తనను రేప్ చేయలేదని.. ప్రదీప్, కృష్ణుడుపై చేసిన ఆరోపణలు కూడా అవాస్తవాలేనని.. యువతి మీడియా ముందు స్పష్టం చేసింది. ఫోన్ రికార్డుల గురించి మీడియా అడిగనప్పుడు.. తనను కొట్టి సెలబ్రిటీలతో ఫోన్లో మాట్లాడించారని యువతి చెప్పుకుంది. తనతో పాటు మరో ఇద్దరు అమ్మాయిలను కూడా డాలర్ భాయ్ ట్రాప్ చేశాడని చెప్పుకొచ్చింది.
ఈ రేప్ కేసులో యాంకర్ ప్రదీప్, కృష్ణుడు… ఓ టీఆర్ఎస్ ఎంపీ పీఏ వంటి పేర్లు వెలుగులోకి రావడంతో… కలకలం రేగింది. చివరికి..,ఇందులో ఉన్న గుట్టేమిటో తేల్చాలనిపోలీసులు సీఐడీకి అప్పగించారు. కానీ..ఆమె పోలీసుల ముందు ఈ గుట్టు అంతా చెప్పిందో లేదో కానీ..మీడియా ముందు మాత్రం.. తన తప్పేమీ లేదని.. అంతా డాలర్ భాయ్ పనేనని చెప్పుకొచ్చింది.